Farmer Death : పొలంలోనే ప్రాణాలు విడిచిన అన్నదాత.. వరినాటు వేస్తుండగా ప్రమాదవశాత్తు…
నాగిరెడ్డిపేట ఆత్మకూరులో విషాదం చోటు చేసుకుంది. పొలంలో వరినాటు వేస్తుండగా ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. వరినాట్లు వేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు
Farmer Death : కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం ఆత్మకూరులో విషాదం చోటు చేసుకుంది. పొలంలో వరినాటు వేస్తుండగా ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. వరినాట్లు వేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు బురదలో పడి ఊపిరాడక రైతు యాటకారి వెంకటి (53) మృతిచెం దాడు.దాంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.
ఎస్సై రాజయ్య తెలిపిన వివరాల ప్రకా రం.. గ్రామానికి చెందిన వెంకటి తన భార్యతో కలిసి సోమవారం గ్రామా శివారులోని పొలంలో వరినాటు వేసేందుకు వెళ్లారు. వెంకటి పొలంలో గట్ల పని చేస్తుండగా ప్రమాదవశాత్తు బురదలో పడగా, ఊపిరాడక అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలిపారు. కాగా మృతుడికి మూర్ఛ వ్యాధి ఉన్నట్టు తెలిపారు ఎస్సై. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :