ఇవాళ ఢిల్లీకి ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌.. అమిత్‌షాతో భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి గర్నవర్‌ ఎయిర్‌పోర్టుకు వెళ్లనున్నారు. అక్కడి నుంచి ఢిల్లీ బయలుదేరుతారు. ఢిల్లీ పర్యటనలో..

ఇవాళ ఢిల్లీకి ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌.. అమిత్‌షాతో భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
Follow us
Sanjay Kasula

|

Updated on: Jan 19, 2021 | 5:44 AM

CM Jagan will leave for Delhi : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి గర్నవర్‌ ఎయిర్‌పోర్టుకు వెళ్లనున్నారు. అక్కడి నుంచి ఢిల్లీ బయలుదేరుతారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో జగన్‌ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఇతర కేంద్ర మంత్రులతో కూడా సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.

అయితే ఏపీలో తాజాగా నెలకొన్న పరిణామాలపై జగన్‌ హోంశాఖ మంత్రి అమిత్ షా చర్చించే అవకాశం ఉంది. ఏపీ ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసంపై రాజకీయ దుమారం రేగుతోంది. దీనిపై దేశ వ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఏపీలో నెలకొన్న పరిస్థితులపై అమిత్‌షాతో జగన్‌ చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. విగ్రహాల ధ్వంసం వెనుక రాజకీయ కుట్ర ఉందని నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం.

మరోవైపు ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌తోనూ సీఎం భేటీ అవుతారని తెలుస్తోంది. పెండింగ్‌ నిధులతో పాటు ప్రాజెక్టులు పూర్తయ్యేలా బడ్జెట్‌లో నిధులను కేటాయించాలని ఆర్థిక శాఖ మంత్రిని జగన్‌ కోరే అవకాశం ఉంది. మొత్తం మీద జగన్‌ ఆకస్మిక ఢిల్లీ పర్యటనపై ఏపీ రాజకీయాల్లో హట్‌ టాపిక్‌గా మారింది.

ఇవి కూడా చదవండి :

PM Modi Bengal Visit: ఈనెల 23న పశ్చిమబెంగాల్‌లో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోదీ.. ఏర్పాట్లు ముమ్మరం

Keeping Constant Watch: భారత భూభాగంలో చైనా నిర్మాణ పనులపై స్పందించిన భారత విదేశాంగ శాఖ