గుజరాత్‌లోని సూరత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నిద్రిస్తున్న కూలీలపై నుంచి వెళ్లిన ట్రక్కు..15 మంది దుర్మరణం..
Accident in Surat: రోజంతా పనిచేసిన కూలీలు పుట్‌పాత్‌పై నిద్రిస్తుండగా ఓ భారీ ట్రక్కు వారిపై దూసుకెళ్లింది. దీంతో నిద్రలోనే వారి బతుకులు తెల్లారిపోయాయి.
Accident in Surat: రోజంతా పనిచేసిన కూలీలు పుట్‌పాత్‌పై నిద్రిస్తుండగా ఓ భారీ ట్రక్కు వారిపై దూసుకెళ్లింది. దీంతో నిద్రలోనే వారి బతుకులు తెల్లారిపోయాయి. ఓ ట్రక్ డ్రైవర్ నిర్లక్ష్యానికి ఏకంగా 15 మంది మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గుజరాత్‌లోని సూరత్ జిల్లా కోసంబి పట్టణంలో జరిగిన ఈ ఘటన అందరిని కలిచివేస్తుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
రాజస్థాన్‌లోని బాన్స్‌వాడకు చెందిన కొంతమంది పొట్టకూటి కోసం కోసంబి పట్టణంలో కూలీ పనులు చేస్తూ బతుకుతున్నారు. దినం మొత్తం పనిచేసి అలసిన శరీరాలతో వచ్చి పుట్‌పాత్‌పై పడుకున్నారు. పాపం వారికి తెలియదు కాబోలు ఇదే చివరి రాత్రి అవుతుందని. అర్ధరాత్రి చెరుకు లోడ్‌తో వస్తున్న ఓ ట్రాక్టర్‌ను ఢీ కొట్టిన ఓ ట్రక్కు అదుపుతప్పి పుట్‌పాత్ ఎక్కి కూలీలపై నుంచి దూసుకెళ్లింది. దీంతో 12 మంది అక్కడికక్కడే మృతిచెందగా మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా చికిత్స కొనసాగిస్తున్నారు. వీరి పరిస్థితి కూడా విషమంగా ఉందని తెలుస్తోంది. దీంతో ఆ ప్రాంతం మొత్తం విషాదం అలుముకుంది. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.