FIR against Amazon: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు!

 వివిధ ఉత్పత్తులపై జాతీయ చిహ్నాలను ముద్రించినందుకు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌ విక్రయదారులపై భోపాల్ క్రైమ్ బ్రాంచ్ ఎఫ్ఐఆర్ నమోదుచేసింది. షూస్, మగ్‌లు, టీ-షర్టులపై జాతీయ చిహ్నాలను ముద్రించినందుకు అమెజాన్ కంపెనీకి నోటీసులు వెళ్లనున్నట్లు భోపాల్ పోలీస్ కమిషనర్ మక్రంద్ డ్యూస్కర్ పేర్కొన్నారు.

FIR against Amazon: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు!
Amazon
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 26, 2022 | 6:18 PM

FIR registered against Amazon sellers: వివిధ ఉత్పత్తులపై జాతీయ చిహ్నాలను ముద్రించినందుకు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌ విక్రయదారులపై భోపాల్ క్రైమ్ బ్రాంచ్ ఎఫ్ఐఆర్ నమోదుచేసింది. షూస్, మగ్‌లు, టీ-షర్టులపై జాతీయ చిహ్నాలను ముద్రించినందుకు అమెజాన్ కంపెనీకి నోటీసులు వెళ్లనున్నట్లు భోపాల్ పోలీస్ కమిషనర్ మక్రంద్ డ్యూస్కర్ పేర్కొన్నారు. నేషనల్ హానర్ అమెండమెంట్ యాక్ట్‌ కింద సెక్షన్ 2, సెక్షన్ 505 (2) ప్రకారం కేసు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. త్రివర్ణ పతాకానికి చెందిన చిత్రాలు/ముద్రలతో కూడిన ఉత్పత్తులను విక్రయిస్తున్నారనే ఆరోపణలపై అమెజాన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డీజీపీని రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ఆదేశించినట్లు జనవరి 25 (మంగళవారం)న మీడియాకు వెల్లడించారు.

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ విక్రయిస్తున్న ఉత్పత్తులపై మన జాతీయ జెండాను ఉపయోగిస్తున్నారని నా దృష్టికి వచ్చింది. జాతీయ జెండా చిహ్నాలను బూట్లపై ఉపయోగించడాన్ని సహించలేమని మిశ్రా ఓ పత్రికా ప్రకటనలో అన్నారు. ప్రాథమికంగా ఇది ‘జాతీయ జెండా కోడ్’ను ఉల్లంఘించడం అవుతుందని, అందువల్ల అమెజాన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని మధ్యప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి)ని ఆదేశించినట్లు ఆయన తెలిపారు.

ఐతే అమెజాన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయమని మిశ్రా పోలీసులను ఆదేశించడం ఇదేం మొదటిసారి కాదు. గత ఏడాది నవంబర్‌లో కూడా ఈ-కామర్స్ సైట్ ద్వారా విషపూరిత సల్ఫస్ (వ్యవసాయానికి వినియోగించే) టాబ్లెట్‌లను ఆర్డర్ చేయడం ద్వారా యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అమెజాన్ అఫీషియల్స్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని మిశ్రా ఆదేశించాడు.

Also Read:

GATE 2022 Exams: గేట్ 2022 పరీక్షలపై ఐఐటీ ఖరగ్‌పూర్ తాజా నోటిఫికేషన్! హెడ్యూల్ ప్రకారమే పరీక్షలు..

ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు