దొంగస్వాములతో తస్మాత్ జాగ్రత్త.. ప్రసాదం అంటూ వస్తారు.. మత్తు మందు ఇచ్చి ఇల్లు గుల్ల చేస్తారు..!

మాలధారణ పేరుతో దొంగ స్వాములు రెచ్చిపోతున్నారు. ప్రసాదం ఇస్తామంటూ మత్తు పదార్థాలు ఇచ్చి దోపిడీకి పాల్పడుతున్నారు. తాజాగా జనగామ జిల్లాలో దొంగస్వాముల మాయ మాటలు నమ్మి...

దొంగస్వాములతో తస్మాత్ జాగ్రత్త.. ప్రసాదం అంటూ వస్తారు.. మత్తు మందు ఇచ్చి ఇల్లు గుల్ల చేస్తారు..!
Paid Leaves Fraud
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 11, 2020 | 4:37 PM

మాలధారణ పేరుతో దొంగ స్వాములు రెచ్చిపోతున్నారు. ప్రసాదం ఇస్తామంటూ మత్తు పదార్థాలు ఇచ్చి దోపిడీకి పాల్పడుతున్నారు. తాజాగా జనగామ జిల్లాలో దొంగస్వాముల మాయ మాటలు నమ్మి కొంతమంది అడ్డంగా మోసపోయారు. వివరాల్లోకెళితే.. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో అయ్యప్పమాల వేషధారణలో ఇద్దరు వ్యక్తులు హల్‌చల్ చేశారు. మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన గదేపక ఐలమ్మ, తన కోడలు రేణుకలకు ప్రసాదం పేరుతో రంగు నీళ్లు కలిపిన మత్తుమందు ఇచ్చారు. అది సేవించిన వారిద్దరూ అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఆ వెంటనే సదరు దొంగ స్వాములు ఇంటిని గుల్ల చేశారు. ఇంట్లో ఉన్న రూ.11వేల నగదును ఎత్తుకెళ్లారు. బాధితులు లేచి చూసేసరికి ఇల్లంతా చిందరవందరగా ఉంది. దీంతో అసలు విషయం గ్రహించిన బాధితులు.. పోలీసులను ఆశ్రయించారు. వీరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు.