రోడ్లకు ఇరువైపులా పచ్చదనాన్ని పెంచేందుకు ఉద్దేశించిన గ్రోత్ కారిడార్ ఆఫీస్ పై ఏసీబీ దాడులు.. భారీ స్థాయిలో పట్టుబడ్డ నగదు
ప్రజల సొమ్మును నెల నెలా జీతాలుగా పొంది సర్కారీ గిరి వెలగబెడుతోన్న కొందరు ప్రభుత్వోద్యోగులు, ఉద్యోగ నిర్వాహణకొచ్చేసరికి ప్రతీ పనికీ నాకేంటి?..
ప్రజల సొమ్మును నెల నెలా జీతాలుగా పొంది సర్కారీ గిరి వెలగబెడుతోన్న కొందరు ప్రభుత్వోద్యోగులు, ఉద్యోగ నిర్వాహణకొచ్చేసరికి ప్రతీ పనికీ నాకేంటి? అనటం మానడం లేదు. ప్రతీ పనికి లంచాలు వసూలు చేస్తూ మొత్తం వ్యవస్థలనే భ్రష్టుపట్టిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ గ్రోత్ కారిడార్ ఆఫీస్ లో భారీస్థాయిలో అవినీతి బయటపడింది. రోడ్లకు ఇరువైపులా పచ్చదనాన్ని అభివృద్ధి చేసేందుకు ఉద్దేశించిన గ్రోత్ కారిడార్ ఆఫీస్ లో 10లక్షల 50వేల నగదు తో పాటు పర్స్ లో ఉన్న 19 వేలు నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న మొక్కల సంరక్షణ చేసే పనులకు సంబంధించిన కాంట్రాక్టర్ల వద్ద నుంచి లంచాలు వసూలు చేస్తూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. ఏసీబీ ఆకస్మిక తనిఖీలలో లంచావతారుల దగ్గర భారీ స్థాయిలో నగదు పట్టుబడ్డం విశేషం.