బెంగళూరులో ఐసీస్‌ కలకలం.. ఆప్తాల్మజిస్ట్‌ను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ

బెంగళూరులో ఇస్లామిక్ స్టేట్‌ ఉగ్ర జాడలు కలకలం రేపాయి. ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రసంస్థతో సంబంధం ఉందన్న ఆరోపణలపై బెంగళూరులో ఓ ఆప్తాల్మజిస్ట్‌ను ఎన్‌ఐఏ అరెస్ట్ చేసింది. ఎన్ఐఏ..

  • Publish Date - 11:40 pm, Tue, 18 August 20 Edited By:
బెంగళూరులో ఐసీస్‌ కలకలం.. ఆప్తాల్మజిస్ట్‌ను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ

బెంగళూరులో ఇస్లామిక్ స్టేట్‌ ఉగ్ర జాడలు కలకలం రేపాయి. ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రసంస్థతో సంబంధం ఉందన్న ఆరోపణలపై బెంగళూరులో ఓ ఆప్తాల్మజిస్ట్‌ను ఎన్‌ఐఏ అరెస్ట్ చేసింది. ఎన్ఐఏ తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరులోని ఎంఎస్ రామయ్య వైద్య కళాశాలలో ఆప్తాల్మజిస్ట్‌గా పని చేస్తున్న అబ్దుర్ రహమాన్‌ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. రహమాన్‌ బెంగళూరులోని బసవన్‌గుడి ప్రాంతానికి చెందినవాడు. రహమాన్‌ను ఇస్లామిక్ స్టేట్ ఖొరసాన్ ప్రావిన్స్ కేసులో అరెస్టు చేశారు. అయితే ఈ ఏడాది మార్చిలో ఢిల్లీలోని జామియా నగర్‌, ఓఖ్లా విహార్‌ నుంచి జహాన్‌జెయిబ్ సమి వని, ఆయన భార్య హీనా బషీర్ బేగ్‌లను ఎన్‌ఐఏ అరెస్ట్ చేసింది. వీరిద్దరు కశ్మీర్‌కు చెందినవారు. వీరిద్దిరికీ ఐసీస్‌తో సంబంధాలు ఉన్నట్లు గుర్తించి అరెస్ట్ చేసి విచారించగా.. వీరు ఇచ్చిన సమాచారం ఆధారంగా రహమాన్‌ను కూడా అరెస్టు చేశారు. కాగా, రహమాన్‌ను ప్రశ్నించినపుడు తాను జహాన్‌జెయిబ్ సమితోనూ, సిరియాలోని మరికొందరు ఐసిస్ ఉగ్రవాదులతోనూ కలిసి పని చేస్తున్నట్లు అంగీకరించినట్లు తెలుస్తోంది. భారత్‌లో ఐసిస్ ఉగ్రవాద కార్యకలాపాలను విస్తరించేందుకు కుట్ర పన్నినట్లు అంగీకరించినట్లు ఎన్ఐఏ పేర్కొంది.

Read More :

మేఘాలయకు బదిలీ అయిన గోవా గవర్నర్

బ్రెజిల్‌లో 33 లక్షలు దాటిన కరోనా పాజిటివ్‌ కేసులు