సుశాంత్ మృతి కేసుపై మరికాసేపట్లో కీలక నిర్ణయం

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై ఈ రోజు కీలక నిర్ణయం వెలువడ నుంది. సీబీఐ విచార‌ణ చేప‌ట్ట‌లా వ‌ద్దా అన్న అంశం మ‌రికొన్ని గంట‌ల్లో తేల‌నున్న‌ది. ఇదే అంశంపై ఇవాళ సుప్రీం కోర్టు రియా చ‌క్ర‌వ‌ర్తి పిటిష‌న్‌పై తీర్పు.....

  • Sanjay Kasula
  • Publish Date - 11:06 am, Wed, 19 August 20
సుశాంత్ మృతి కేసుపై మరికాసేపట్లో కీలక నిర్ణయం

Sushant Death Case  : బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై ఈ రోజు కీలక నిర్ణయం వెలువడ నుంది. సీబీఐ విచార‌ణ చేప‌ట్ట‌లా వ‌ద్దా అన్న అంశం మ‌రికొన్ని గంట‌ల్లో తేల‌నున్న‌ది. ఇదే అంశంపై ఇవాళ సుప్రీం కోర్టు రియా చ‌క్ర‌వ‌ర్తి పిటిష‌న్‌పై తీర్పు ఇవ్వ‌నున్న‌ది. ఈ సంద‌ర్భంగా సుశాంత్ మృతి కేసును సీబీఐకి అప్ప‌గిస్తారా లేదా అన్న అంశం కూడా ఫైనల్ కానుంది. పాట్నాలో త‌న‌పై న‌మోదు అయిన ఎఫ్ఐఆర్‌ను ముంబైకి బ‌దిలీ చేయాల‌ని రియా సుప్రీంలో పిటిష‌న్ పెట్టుకున్న‌ది. వాస్తవానికి ఆ అభ్య‌ర్థన‌పై ఆగ‌స్టు 11వ తేదీన విచార‌ణ జ‌రిగింది. కానీ జ‌స్టిస్ హృషికేశ్ రాయ్ నేతృత్వంలోని ఏక‌స‌భ్య ధ‌ర్మాస‌నం తీర్పును రిజ‌ర్వ్  లో పెట్టింది.

అయితే.. సుశాంత్ గ‌ర్ల్‌ఫ్రెండ్ రియా త‌ర‌పున సీనియ‌ర్ న్యాయ‌వాది శ్యామ్ దివాన్‌, మ‌హారాష్ట్ర త‌ర‌పున సీనియ‌ర్ కౌన్సిల్ అభిషేక్ మ‌ను సింఘ్వి వాదనలు వినిపిస్తున్నారు. సుశాంత్ మృతి కేసు విచార‌ణ ముంబైలో జ‌ర‌గాల‌ని మ‌హారాష్ట్ర వాదిస్తున్న‌ది. ఎఫ్ఐఆర్ పాట్నాలో న‌మోదైనందున.. జీరో ఎఫ్ఐఆర్ అంటూ సింఘ్వి వాదనలు వినిపించారు. ఇక ఇదే కేసులో బీహార్ రాష్ట్రం త‌ర‌పున మ‌నింద‌ర్ సింగ్ వాదిస్తున్నారు. సుశాంత్ తండ్రి రాజ్‌పుత్ త‌ర‌పున సీనియ‌ర్ కౌన్సిల్ వికాశ్ సింగ్ వాదిస్తున్నారు. ఎటువంటి ఎఫ్ఐఆర్ న‌మోదు కాకుండానే ముంబై పోలీసులు విచార‌ణ చేప‌డుతున్నార‌ని వికాశ్ అంటున్నారు.

ఇదిలావుంటే ఇప్పటికే సుశాంత్ కేసును సీబీఐకి అప్ప‌గించాలంటూ బీహార్ రాష్ట్ర ప్ర‌భుత్వం చేసిన సిఫార‌సుకు కేంద్రం ఓకే చెప్పింది. సోలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా కూడా కేసును సీబీఐకి అప్ప‌గించేందుకు సుముఖ‌త వ్య‌క్తం చేశారు. సుశాంత్ జూన్ 14వ తేదీన బాంద్రాలోని త‌న ఇంట్లో ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు ముంబై పోలీసులు నిర్ధారించారు. కానీ త‌న కుమారుడి మ‌ర‌ణానికి రియానే కార‌ణ‌మంటూ సుశాంత్ తండ్రి పిటిష‌న్ దాఖ‌లు చేశారు. సుశాంత్ మ‌ృతి బాలీవుడ్ వర్గాలతో పాటు మహరాష్ట్ర రాజకీయాలపై పెద్ద ప్రభావాన్ని చూపిస్తోంది. మరో వైపు సోషల్ మీడియాలో పెద్ద న్యాయ పోరాటం కూడా నడుస్తోంది.