కాగ్నానదిలో కొట్టుక పోయిన కారు డ్రైవర్..
వికారాబాద్ జిల్లా తాండూరు కాగ్నానది వద్ద విషాదం చోటుచేసుకుంది. రోడ్డుపైన ఉన్న గుంతను తప్పించబోయి పక్కనే ఉన్న నదిలోకి కారు దూసుకేళ్లింది. ఈ ఘటన మంగళవారం వికారాబాద్‌లో..

వికారాబాద్ జిల్లా తాండూరు కాగ్నానది వద్ద విషాదం చోటుచేసుకుంది. రోడ్డుపైన ఉన్న గుంతను తప్పించబోయి పక్కనే ఉన్న నదిలోకి కారు దూసుకేళ్లింది. ఈ ఘటన మంగళవారం వికారాబాద్‌లో జరిగింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
ఈ సంఘటన సమయంలో అటుగా వెళుతున్న వాహనదారులు అతడిని కాపాడేందుకు చాలా ప్రయత్నించినప్పటికీ సదరు బాధితుడిని కాపాడలేకపోయారు. వరద నీటిలో కొట్టుక పోతున్న అతడిని రక్షించేందుకు ఓ తాడుతో ప్రయత్నించారు. అతడికి తాడును వేశారు. రక్షించేందుకు ప్రయత్నించిన వ్యక్తులు చాాలా సార్లు తాడును అందించేందుకు ప్రయత్నించారు. కానీ వ్యాక్తి తాడును అందుకోలేక పోయాడు. సదరు మృతుడిని యాలాల మండల వాసిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.




