మార్కెట్‌యార్డు ఛైర్మన్‌ కొడుకుపై కిరోసిన్‌ పోసి నిప్పంటించి మొదటి భార్య

కృష్ణజిల్లాలో పట్టపగలు దారుణం జరిగింది. మచిలీపట్నం మార్కెట్‌యార్డు ఛైర్మన్‌ అచ్చాబా కుమారుడు ఖాదర్‌ బాషాపై హత్యాయత్నం జరిగింది.

మార్కెట్‌యార్డు ఛైర్మన్‌ కొడుకుపై కిరోసిన్‌ పోసి నిప్పంటించి మొదటి భార్య

కృష్ణజిల్లాలో పట్టపగలు దారుణం జరిగింది. మచిలీపట్నం మార్కెట్‌యార్డు ఛైర్మన్‌ అచ్చాబా కుమారుడు ఖాదర్‌ బాషాపై హత్యాయత్నం జరిగింది. ఖాదర్‌ బాషా ఇంట్లో ఉన్న సమయంలో ఒంటిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. ఈ హఠాత్తు పరిణామంతో తేరుకున్న కుటుంబసభ్యులు ఖాదర్ భాషాను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ఖాదర్‌ బాషాకు 40 శాతానికి పైగా గాయాలయ్యాయి. అనంతరం బాధితుడిని చికిత్స కోసం పోలీసులు విజయవాడ ఆసుపత్రికి తరలించారు. ఖాదర్‌బాషా భార్యపై అనుమానంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అయితే, ఖాదర్ బాషా మొదటి భార్య షాజియా ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఇంట్లోకి ప్రవేశించిన షాజియా బాషాపై పెట్రోల్ పోసి నిప్పంటించి పరారైంది. వివాహేతర సంబంధం కారణంగా మొదటి భార్య షాజియాతో గత కొద్ది రోజులుగా బాషాల మధ్య విభేదాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మూడు నెలల క్రితం‌ షాజియా సొంత చెల్లెలును బాషా రెండో వివాహం చేసుకున్నాడు. భార్య షాజియాకు తెలియకుండా వేరొక కాపురం పెట్టాడు. ఈ విషయం తెలియడంతో ఆగ్రహంతో భర్త ఖాదర్ భాషాపై షాజియా పెట్రోల్ పోసి నిప్పంటించి పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి హత్యాయత్నం కేసు నమోదు చేసి నిందితురాలి కోసం గాలింపు చేపట్టామని పోలీసులు తెలిపారు.