చైనాలో చెరువులో పడ్డ బస్సు.. 21 మంది మృతి, మరికొందరు గల్లంతు

చైనాలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు బస్సు చెరువులో పడి 21 మంది ప్రయాణికులు మృత్యువాతపడ్డారు. దక్షిణ చైనాలోని గూయిజ్‌హౌ ప్రావిన్సులో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

చైనాలో చెరువులో పడ్డ బస్సు.. 21 మంది మృతి, మరికొందరు గల్లంతు
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 08, 2020 | 10:24 AM

చైనాలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు బస్సు చెరువులో పడి 21 మంది ప్రయాణికులు మృత్యువాతపడ్డారు. దక్షిణ చైనాలోని గూయిజ్‌హౌ ప్రావిన్సులో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. అన్షున్ సిటీ నుంచి ప్రయాణికులతో నిండుగా ఉన్న బస్సు ప్రమాదవశాత్తు రోడ్డుపై ఉన్న రెయిలింగ్‌ను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా హోంగ్ షాన్ చెరువులోకి బస్సు దూసుకుపోయింది. చెరువునీటిలో బస్సు మునిగిపోవడంతో అందులోని 21 మంది ప్రయాణికులు చనిపోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు. మరో 15 మంది తీవ్రంగా గాయడగా.. కొందరు గల్లంతయ్యారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, ప్రయాణికుల్లో ఎక్కువగా చైనాలోని గావోకా విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష రాయడానికి వెళ్తున్న విద్యార్థులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. బస్సులో మొత్తం ఎంత మంది ప్రయాణికులు ఉన్నారన్న స్పష్టత రావాల్సి ఉంది. చెరువులో గల్లంతైన ప్రయాణికుల కోసం రెస్య్కూ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చిన అధికారులు దర్యాప్తు చేపట్టారు.