AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guntur: దొంగతనానికి వచ్చి దర్జాగా బెడ్ పై నిద్రపోయాడు.. తెల్లారగానే ఏం జరిగిందో తెలుసా?

సాధారణంగా దొంగతనానికి వచ్చిన వారు ఎంత త్వరగా తమ పని పూర్తి చేసుకుని బయట పడదామా? అని ఆలోచిస్తుంటారు. అయితే గుంటూరు (Guntur) జిల్లాలోని  చిలకలూరిపేట(Chilakaluripet) లో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది

Guntur: దొంగతనానికి వచ్చి దర్జాగా బెడ్ పై నిద్రపోయాడు.. తెల్లారగానే ఏం జరిగిందో తెలుసా?
Basha Shek
|

Updated on: Jan 30, 2022 | 11:23 AM

Share

సాధారణంగా దొంగతనానికి వచ్చిన వారు ఎంత త్వరగా తమ పని పూర్తి చేసుకుని బయట పడదామా? అని ఆలోచిస్తుంటారు. అయితే గుంటూరు (Guntur) జిల్లాలోని  చిలకలూరిపేట(Chilakaluripet) లో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. దొంగతనానికి వచ్చిన  ఓ దొంగ (Thief) అలసిపోయాడేమో తెలియదు కానీ అదే ఇంట్లోని బెడ్ పై బాగా గురక పెట్టి నిద్రపోయాడు. అప్పటివరకు తాళాలు వేసి ఉన్న ఇల్లు తలుపులు తెరచి ఉండడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మంచంపై ఆదమరచి నిద్రస్తోన్న ఆ దొంగను వారికి పట్టించారు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి.  పట్టణంలోని పండరీపురంకు చెందిన ఓ కుటుంబం కొద్ది రోజుల క్రితం అమెరికాకు వెళ్లింది.  అయితే ఆ ఇంటికి తాళాలు వేసి ఉండటాన్ని గమనించిన విజయ‌వాడకు చెందిన దొంగ  ఇంట్లో  చోరీకి ప్లాన్ వేశాడు.

అనుకున్న ప్రకారం అర్ధరాత్రి సమయంలో ఇంటి వెనుక తలుపులు తొలగించి ఇంట్లోకి ప్రవేశించాడు. అక్కడున్న సీసీటీవీ కెమెరాలను తొలగించాడు.  అయితే  కప్ బోర్డులు, అల్మారాలు.. ఇలా ఇళ్లంతా గాలించినా విలువైన వస్తువులేమీ అతనికి దొరకలేదు.  అప్పటికే అలసిపోయాడేమో కాసేపు మంచంపై కునుకు తీద్దామనుకున్నాడు.   ఏకంగా బెడ్ రూంలోని బెడ్ పై  ఆదమరచి నిద్రపోయాడు.  కాగా తెల్లవారుజాము ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఇంటి వచ్చిన పోలీసులకు ఇంటిలోనే ఆదమరిచి నిద్రపోతున్న దొంగ కనిపించాడు. వెంటనే  అతడిని అదుపులోకి తీసుకున్నారు.  పోలీసులు కేసు నమోదే చేసి దర్యాప్తు ప్రారంభించారు.

-టి. నాగరాజు, టీవీ9 తెలుగు, గుంటూరు

Also Read:Kurnool: కర్నూలు జిల్లాలో విషాదం.. ప్రేమకు అడ్డు చెప్పిన పెద్దలు.. ఎడబాటుతో ప్రేమికుల బలవన్మరణం..

Ira Khan: ముసలిదైపోయింది అంటూ ఆమీర్ ఖాన్ కూతురిని దారుణంగా దూషించిన నెటిజన్.. హిత బోధ చేసిన ప్రముఖ సింగర్..

Pushpa: క్రికెట్ ప్రపంచాన్ని ఊపేస్తోన్న ‘పుష్ప’ ఫీవర్.. శ్రీవల్లి సిగ్నేచర్ స్టెప్పును అశ్విన్ ఎలా అనుకరించాడో మీరే చూడండి..

కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌