Black Magic: మామిడి తోటలో భయానక పూజలు.. చెట్టుకు ఆడవేషం వేసి.. మంగళసూత్రం కట్టి.!
విజయనగరం జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. డెంకాడ మండలం పెదతాడివాడ పంచాయతీ ఊడికలపేటలో క్షుద్ర పూజలు స్థానికులను..
విజయనగరం జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. డెంకాడ మండలం పెదతాడివాడ పంచాయతీ ఊడికలపేటలో క్షుద్ర పూజలు స్థానికులను భయాందోళనకు గురిచేశాయి. ఊడికలపేటలోని మామిడి తోటలో పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. గ్రామానికి ఆనుకోని ఉన్న మామిడి తోటలో కొందరు దుండగులు క్షుద్ర పూజలు చేసినట్టు గ్రామస్తులు చెబుతున్నారు.
మామిడి చెట్టుకు ఆడవారి ముఖచిత్రం వేసి, చీర కట్టి మేకులు కొట్టి, పువ్వులు పెట్టి మంగళసూత్రం కట్టినట్టుగా ఉంది. తోటలో పూజలపై గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఏం జరుగుతుందోనన్న కలవరం చెందుతున్నారు. రెండు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు ఇలా చేసారంటూ గ్రామస్తులు వాపోయారు. గ్రామంలోని యువకులు ఆటవిడుపు కోసం ఉపయోగించే స్థలంలో ఇలా మామిడి చెట్టుకు భయంకర పూజలు చేయటం కనిపించడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. కాగా, వారంతా జరిగిన విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read:
ప్రతీ నెలా రూ. 3810 డిపాజిట్ చేస్తే.. మీ కూతురు కోసం రూ. 27 లక్షలు పొందొచ్చు.. పూర్తి వివరాలు..
టీమిండియా చరిత్రలో చెత్త మ్యాచ్.. జీరోకి నాలుగు వికెట్లు.. ఆ ఇంగ్లీష్ బౌలర్ ఎవరంటే.?