Andhra Pradesh: పుష్ప మూవీ సీన్లు చూసి బోరు కొట్టేసిందా? ఇది కదా అసలు చిత్రం!
పుష్పలాంటి స్మగ్లర్లు శేషాచలం అడవుల్లో మాత్రమే లేరు.. దేశం అంతా కూడా చాలా మంది ఉన్నారు .కాకపోతే ఇక్కడ రెడ్ శాండల్ బదులు లిక్కర్ స్మగ్లింగ్‌కు ఎగబడ్డారు. ఎంత నిఘా పెట్టినా నయా రూట్లను ఎంచుకుంటున్నారు స్మగ్లర్స్. అలాగే అడ్డంగా బుక్కవుతున్నారు. పాల మాటున ఘాటు సరుకును సరఫరా చేస్తూ దొరికిపోయారు.

పుష్పలాంటి స్మగ్లర్లు శేషాచలం అడవుల్లో మాత్రమే లేరు.. దేశం అంతా కూడా చాలా మంది ఉన్నారు .కాకపోతే ఇక్కడ రెడ్ శాండల్ బదులు లిక్కర్ స్మగ్లింగ్‌కు ఎగబడ్డారు. ఎంత నిఘా పెట్టినా నయా రూట్లను ఎంచుకుంటున్నారు స్మగ్లర్స్. అలాగే అడ్డంగా బుక్కవుతున్నారు. పాల మాటున ఘాటు సరుకును సరఫరా చేస్తూ దొరికిపోయారు.
చిత్తూరు జిల్లాలో ఇప్పుడు స్మగ్లింగ్ కార్యక్రమాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. స్మగ్లింగ్ తీరు సినిమా సీన్ల ను తలపిస్తున్నాయి. గతంలో ఎర్రచందనం దుంగలను పాల వ్యాన్లలో తరలించినట్లే, ఇప్పుడు మద్యం సీసాలను స్మగ్లర్లు అక్రమ రవాణా చేస్తున్నారు. శేషాచలం అటవీ ప్రాంతంలోని ఎర్ర బంగారం మిల్క్ ట్యాంకర్లలో ఎలా తరలి పోయిందో పుష్ప సినిమాలో సీన్లు కళ్ళకు కట్టినట్లు చూపిస్తే, ఇప్పుడు చిత్తూరులో అదే తరహా లిక్కర్ స్మగ్లింగ్‌ను పోలీసులు గుర్తించారు.
పాలవ్యానులో కర్ణాటక మద్యం తరలింపును పసిగట్టారు. ముందస్తు సమాచారంతో దాడులు నిర్వహించిన చిత్తూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇరువారం క్రాస్ వద్ద వాహనాల తనిఖీలు చేసి అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు. పాల వ్యాన్ లో ముందు భాగం పాలు ప్యాకెట్లు కనిపించేలా ఏర్పాటు చేసుకుని వెనుక భాగమంతా మద్యం కేసులను అమర్చారు. ఈ మేరకు పాల వ్యాన్ కూడా డిజైన్ చేసుకున్న స్మగ్లర్లు గత కొంత కాలంగా ఇదే పని ఎంచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. కర్ణాటకలోని కోలార్ జిల్లా నుంచి కర్ణాటక మద్యం బాటిల్స్ ను చిత్తూరు కు తరలిస్తున్నట్లు ఎస్సీబీ పోలీసులు గుర్తించారు. పాలవ్యానులోని 92 కేసుల అక్రమ మద్యాన్ని గుర్తించిన సెబ్ పోలీసులు.. పాలవ్యాన్ తో పాటు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.
కర్ణాటక మద్యం అక్రమ అమ్మకాలు పెద్ద ఎత్తున జరుగుతున్నట్లు గుర్తించిన ఎస్సీబీ ప్రత్యేక నిఘా పెట్టారు. చిత్తూరు లోనే రోజుకు రూ. 10 లక్షల మేర కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లు అమ్మకం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. పెద్ద ముఠాగా ఏర్పడ్డ గ్యాంగ్ కర్ణాటక లిక్కర్ అమ్మకాలు సాగిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు పక్కాగా కాపు కాశారు. పుష్ప సినిమా సీన్లను తలదన్నే రీతిలో కొనసాగుతున్న లిక్కర్ స్మగ్లింగ్ ను బయట పెట్టారు. ఇందులో భాగంగానే పాలవ్యానులో ఉన్న 92 కేసుల అక్రమ మద్యాన్ని గుర్తించిన సెబ్ పోలీసులు.. పాలవ్యాన్ తో పాటు చిత్తూరుకు చెందిన విశ్వనాథ్, దేవా, గంగాధర నెల్లూరుకు చెందిన రాజేష్‌లను అదుపులోకి తీసుకున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
