Crime news: ప్రేమ పెళ్లి వద్దనందుకు యువకుడి ఆత్మహత్య..
ప్రేమ పెళ్లి కాదన్నందుకు ఓ యువకుడు తనువు చాలించాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్‌లో సోమవారం చోటుచేసుకుంది...
ప్రేమ పెళ్లి కాదన్నందుకు ఓ యువకుడు తనువు చాలించాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్‌లో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎర్ర రమేశ్ (21) గజ్వేల్‌లో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. అదే గ్రామానికి చెందిన వేరే కులానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నాడు. వారు పెళ్లి చేసుకోవాలని భావించగా ఇరు కుటుంబాల సభ్యులు నిరాకరించారు. ఈనెల 26న గ్రామ పెద్దల సమక్షంలో వారికి సర్దిచెప్పారు. ఒకరినొకరు కలుసుకోవద్దని తీర్మానించారు.
దీంతో మనోవేదన గురైన యువకుడు అదే రోజు పొలం వద్ద పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబీకులు గజ్వేల్ ప్రభుత్వాస్పతికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ములుగు మండలం వంటిమామిడి సమీపంలోని ఆర్వీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఒక రోజు చికిత్స చేసినా ఆరోగ్యం మెరుగు పడకపోవటంతో ఈనెల 28న హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ 29న చనిపోయాడు. యువకుడి తండ్రి ఎర్ర సిద్ధయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Also.. Gudumba Base: నది మధ్యలో గుడుంబా స్థావరం.. వీరి తెలివి చూస్తే షాక్ అవుతారు..