Liquor Mafia: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలంటే ఇదేమరి.. నాటు సారా ఎక్కడ దాచారో తెలిస్తే అవాక్కవుతారు..!

Liquor Mafia: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలంటే ఇదేమరి. నాటుసారా స్థావరాలపై ఎస్‌ఇబి అధికారుల దాడుల నుంచి తప్పించుకునేందుకు కేటుగాళ్ళు

Liquor Mafia: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలంటే ఇదేమరి.. నాటు సారా ఎక్కడ దాచారో తెలిస్తే అవాక్కవుతారు..!
Liquor
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 01, 2021 | 5:20 AM

Liquor Mafia: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలంటే ఇదేమరి. నాటుసారా స్థావరాలపై ఎస్‌ఇబి అధికారుల దాడుల నుంచి తప్పించుకునేందుకు కేటుగాళ్ళు కళ్ళు చెదిరే ప్లాన్‌ వేశారు. చీరాల నడిబొడ్డులో కుందేరు వాగులో ఏపుగా పెరిగిన రెల్లుదుబ్బల మధ్య నీటిలో తేలే స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వారెవ్వా ప్లాన్‌ అదిరిందంటూ చంకలు గుద్దుకుంటూ నాటుసారా కాసేందుకు రెడీ అయిపోయారు. అయితే ఎప్పటిలాగే సమాచారం లీకైంది..ఇంకేముంది ఎస్‌ఇబి అధికారుల దాడులు, తయారీ సామన్లు ద్వంసం, అరెస్ట్‌లు.. ఇంత పక్కాగా ప్లాన్‌ చేస్తే వికీ లీక్స్‌ లెవల్లో ఎవరు లీక్‌ చేశారబ్బా అంటూ నాటుసారా కేటుగాళ్ళు అల్లాడిపోయారు. డామిట్‌ కధ అడ్డం తిరిగిందంటూ వాపోయారు.

వివరాల్లోకెళితే.. ప్రకాశంజిల్లా చీరాల మండలం రామకృష్ణపురం దగ్గర కుందేరు వాగు మధ్యలో నాటుసారా స్థావరాన్ని ఎస్‌ఇబి అధికారులు గుర్తించారు. వాగు మధ్యలో చెక్కలతో కృత్రిమ నివాసం ఏర్పాటు చేసుకున్న నాటుసారా అక్రమార్కులు అక్కడే నాటుసారా కాస్తున్నట్టు సమాచారం అందుకున్నారు. వెంటనే కుందేరు లోపలికి వెళ్ళి దాడి చేశారు. వాగు మధ్యలో ఏర్పాటు చేసుకున్న స్థావరంలో భారీగా బెల్లం ఊటను గుర్తించారు. నాటుసారా కాసేందుకు సిద్దం చేసిన నల్లబెల్లం, కరక్కాయ నిల్వలను గుర్తించారు. ఏరు మధ్యలో ఏపుగా పెరిగిన రెల్లుదుబ్బల మధ్య బయటకు కనిపించని విధంగా నీటిపైనే తేలియాడే స్థావరాన్ని తయారు చేసుకున్న నిందితులు గత కొంతకాలంగా నాటుసారా కాస్తున్నట్టు గుర్తించారు. 4వేల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. అక్కడే దాచి ఉంచిన 250 కేజీల నల్లబెల్లం, 50 కేజీల కరక్కాయలను స్వాధీనం చేసుకున్నారు. నాటుసారా స్థావరాన్ని నడుపుతున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

అత్యంత రహస్యంగా నీటిపై తేలియాడే స్థావరం.. ఎక్కడో నదులు, సముద్రాల మధ్య ఇలాంటి స్థావరాలు ఏర్పాటు చేసుకుని స్మగ్లింగ్‌ ముఠాలు అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించినట్టు విన్నాం.. చూశాం.. అయితే చీరాల నడిబొడ్డులో కుందేరు వాగులో ఇలాంటి స్థావరాన్ని చూసి ఎస్‌ఐబి అధికారులు ఖంగుతిన్నారు. వాగు మధ్యలో తేలియాడే స్థావరాన్ని చెక్కలతో నిర్మించుకున్నారు. అక్కడే బెల్లం ఊట తయారు చేస్తారు. సారాలో వినియోగించే నల్లబెల్లం, కరక్కాయలు, ఇతర సామాగ్రిని సిద్దం చేసుకున్నారు. వాగు మధ్యలో చెక్కలపై బట్టీలు పెట్టడం సాధ్యం కాదు కాబట్టి వెరైటీగా గ్యాస్‌ పొయ్యిలను ఏర్పాటు చేసుకున్నారు. ఏరు మధ్యలోకి చేరుకోవాలంటే నడుంలోతు బురదనీటిలో నడచివెళ్ళాల్సి ఉంటుంది… ఇంత రిస్క్‌ చేసి ఎవరూ ఇక్కడికి రారనుకుని దుకాణం పెట్టేశారు. అంతే కాకుండా ఏరుమద్యంలో బురదలో ఏపుగా పెరిగిన రెల్లుదుబ్బు చుట్టూ రక్షణ కవచంగా ఉందని భావించారు… అయితే తాడిని తన్నేవాడు ఒకడుంటే, వాడి తలను తన్నేవాడు మరొకరు ఉంటారన్నట్టుగా ఎస్‌ఇబి అధికారులు ఈ అక్రమార్కుల గుట్టు రట్టు చేశారు. నడుంలోతు ఏరులో బురదలో నడుచుకుంటూ స్థావరం దగ్గరకు చేరుకుని అక్రమంగా నాటుసారా కాసేందుకు సిద్దం చేసిన స్థావరాన్ని కనిపెట్టారు. 4వేల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. అక్కడే దాచి ఉంచిన 250 కేజిల నల్లబెల్లం, 50 కేజీల కరక్కాయలను స్వాధీనం చేసుకున్నారు. నాటుసారా స్థావరాన్ని నడుపుతున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు అధికారులు.

Also read:

మందుబాబుల మత్తు వదల కొడతాం..ఇల్లీగల్ డీ అడిక్షన్‌ రీహాబిలిటేషన్‌ సెంటర్ల అక్రమ దందా.. టీవీ9 నిఘాలో విస్తుకొలిపే నిజాలు!

Business Idea: వాటే ఐడియా గురూ.. తండ్రి ఆసక్తి.. తనయుని వ్యాపారం.. కోట్లాది రూపాయల టర్నోవర్..

Omicron variant: ఒమిక్రాన్ వేరియంట్‌తో థర్డ్ వేవ్ వస్తుందా? కాన్పూర్ ఐఐటీ ప్రొఫెసర్ అంచనా..