Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఎన్నో కలలతో ఇంటిని కట్టుకుంటే వరద ముంచేసింది.. తట్టుకోలేక వృద్ధురాలు ఏం చేసిందంటే

సొంత ఇల్లు ఉంటే ఆ ధీమానే వేరు. అందుకే ఎన్ని కష్టాలు ఎదురైనా సొంతింటి నిర్మించుకోవాలని ప్రతి ఒక్కరూ కలలుగంటారు. అందుకోసం పైసా పైసా కూడబెట్టి, అప్పూసొప్పూ చేసి తమ కలల సౌధాన్ని నిర్మించుకుంటారు. అయితే.. ప్రకృతి విపత్తు ఆ ఇంటిని....

Telangana: ఎన్నో కలలతో ఇంటిని కట్టుకుంటే వరద ముంచేసింది.. తట్టుకోలేక వృద్ధురాలు ఏం చేసిందంటే
Death In Mancherial
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jul 21, 2022 | 9:55 AM

సొంత ఇల్లు ఉంటే ఆ ధీమానే వేరు. అందుకే ఎన్ని కష్టాలు ఎదురైనా సొంతింటి నిర్మించుకోవాలని ప్రతి ఒక్కరూ కలలుగంటారు. అందుకోసం పైసా పైసా కూడబెట్టి, అప్పూసొప్పూ చేసి తమ కలల సౌధాన్ని నిర్మించుకుంటారు. అయితే.. ప్రకృతి విపత్తు ఆ ఇంటిని నాశనం చేస్తే.. వారి పరిస్థితి వర్ణనాతీతం. తాజాగా మంచిర్యాలలో ఇలాంటి ఘటనే జరిగింది. ఎన్నో ఆశలతో కట్టుకున్న ఇంటిని వరద ముంచెయ్యడంతో ఓ మహిళ తీవ్ర మనస్తాపానికి గురైంది. చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మంచిర్యాల (Mancherial) జిల్లా కేంద్రంలోని బాలజీనగర్ లో వీరయ్య- జమున దంపతులు ఇల్లు కట్టుకున్నారు. ఇటీవల కురిసిన వర్షాలు, వరదలకు సమీపంలోని రాళ్లవాగు కట్టలు తెంచుకుంది. దీంతో వీరి ఇల్లు వరద నీటిలో మునిగిపోయింది. వరద తగ్గాక ఇంటి పరిస్థితిని చూసిన జమున..తీవ్ర మనో వేదనకు గురైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పిల్లర్ కు చీరతో ఉరివేసుకుంది. ఆమె భర్త వీరయ్య అనారోగ్యంతో హైదరాబాద్‌లో (Hyderabad) చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు రోదించిన తీరు కంటతడి పెట్టించింది. కష్టపడి సంపాదించిన సొమ్ముతో కట్టుకున్న ఇల్లు వరదలో మునగడంతో జమున ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె కుమారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కాగా.. మంచిర్యాల పట్టణాన్ని వరద నీరు ముంచెత్తింది. గోదావరి పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షాలు, రాళ్ల వాగు, తోళ్ల వాగు ఉద్ధతితో పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీ, రాం నగర్, పద్మశాలీ కాలనీ సహా పలు కాలనీలు వరద నీటిలోనే చిక్కుకున్నాయి. వరద తగ్గాక కూడా వారి పరిస్థితి దయనీయంగా మారింది. ఇళ్లలో వస్తువుల్ని బురదమయమయ్యాయి. నిత్యావసర సరుకులు, బియ్యం తడిసిపోయాయి. రాంనగర్ లోని ఇళ్లలో మొదటి అంతస్తులోకి నీరు రావడంతో గ్రౌండ్ ఫ్లోర్ లోని ఎలక్ట్రికల్ వస్తువులు, ఫర్నిచర్ పూర్తిగా పాడైపోయాయి.

గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో మంచిర్యాల విలవిల్లాడింది. గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రాళ్లవాగు బ్యాక్‌ వాటర్‌ కారణంగా పాత మంచిర్యాల, రెడ్డి కాలనీ, ఎల్‌ఐసీ కాలనీ, రాంనగర్‌, ఎన్టీఆర్‌ నగర్‌, బైపాస్‌ రోడ్డు, ఆదిత్య ఎన్‌క్లేవ్‌లో ఇళ్లు నీట మునిగాయి. గోదావరి రోడ్డులోని మాతా శిశు సంరక్షణ కేంద్రం పూర్తిగా నీటిలో మునిగిపోయింది. అక్కడి వెళ్ళేందుకు కూడా వీలుకాని పరిస్థితులు నెలకొన్నాయి. వేంపల్లి వద్ద జాతీయ రహదారిపై దాదాపు 6 అడుగుల మేర వరద నీరు చేరింది. రెండు రోజులుగా నీరు నిలిచి ఉండటంతో మంచిర్యాల-లక్సెట్టిపేట మీదుగా కరీంనగర్‌ వెళ్లే వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..