AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: టెన్త్ క్లాస్ స్టూడెంట్ ఆత్మహత్య​.. అతని ఇన్​స్టాగ్రాం బయోలో రాసింది చూసి షాక్

ఫ్రెండ్‌కి ఇన్ స్టాలో బర్త్ డే విషెస్ తెలిపాడు. అంతలోనే సూసైడ్ చేసుకున్నాడు. అయితే ఇంతలో.. అతను ఇన్ స్టా బయోలో రాసిన విషయాన్ని చదివి ఒక్కసారిగా అందరూ షాక్​ అయ్యారు.

Telangana: టెన్త్ క్లాస్ స్టూడెంట్ ఆత్మహత్య​.. అతని ఇన్​స్టాగ్రాం బయోలో రాసింది చూసి షాక్
Boy Dies
Ram Naramaneni
|

Updated on: Jul 21, 2022 | 8:58 AM

Share

Crime News: అతడు టెన్త్ క్లాస్ చదువుతున్నాడు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. అందరితో కలివిడిగా మాట్లాడతాడు. పెద్దలకు, స్నేహితులకు తెలిసి ఏ సమస్యా లేదు. కానీ ఉన్నపలంగా ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపింది. వివరాల్లోకి వెళ్తే..  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem district) ఇల్లందు(Yellandu)కు చెందిన శివలోకేశ్​(14) అలియాస్​ సోనూ టెన్త్ క్లాస్ చదువుతున్నాడు. బాలుడి తండ్రి రవి స్థానికంగా టెంట్​హౌస్ నడుపుతూ ఫ్యామిలీని పోషిస్తున్నాడు. అయితే.. బుధవారం కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో శివలోకేశ్​ ఉరేసుకుని జీవితాన్ని అర్థాంతరంగా ముగించాడు. బయటకు వెళ్లిన కుటుంబ సభ్యులు తిరిగి వచ్చేసరికి లోకేశ్​ ఫ్యాన్​ను వేలాడుతూ కనిపించాడు. వెంటనే ఇరుగుపొరుగువారి సాయంతో.. లోకేశ్​ను గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు మరణించినట్టు డాక్టర్లు నిర్థారించారు. దీంతో అతని తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. కాగా లోకేశ్​.. సూసైడ్ చేసుకునే ముందు తన ఫ్రెండ్ గౌతమ్​కు ఇన్​స్టాగ్రాంలో బర్త్ డే విషెడ్ తెలిపాడు. కాసేపటికే చనిపోయాడన్న తెలిసేసరికి.. స్నేహితులు ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

ఈ క్రమంలోనే లోకేశ్​ ఫ్రెండ్స్.. అతని ఇన్​స్టాగ్రాం ఫ్రొఫైల్​ చూశారు.  బయోలో రాసిన విషయాన్ని చదివి ఒక్కసారిగా కంగుతిన్నారు. బయోలో తన మరణతేది 20 జులైగా రాసి ఉండటాన్ని చూసి.. షాకయ్యారు. వెంటనే ఈ విషయాన్ని పెద్దలకు చెప్పారు.  తాను చనిపోవాలని ముందే డిసైడయ్యి.. దాని కోసం డేట్ కూడా ఫిక్స్ చేసి.. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో రాయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. బాలుడి ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Boy Death

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
భారతీయ సంస్కృతికి విదేశీ మహిళ ఫిదా.. బెస్ట్ అంటూ కితాబు!
భారతీయ సంస్కృతికి విదేశీ మహిళ ఫిదా.. బెస్ట్ అంటూ కితాబు!