Drugs: గచ్చిబౌలిలో భారీగా డ్రగ్స్ సీజ్.. పోలీసుల అదుపులో ప్రముఖ రాజకీయ నాయకుడి కుమారుడు
హైదరాబాద్ మహా నగరంలో మాదక ద్రవ్యాల వాడకం విచ్చలవిడిగా పెరుగుతోంది. పోలీసులు ఎంత నిఘాద పెట్టిన ఎక్కడో ఒక దగ్గర డ్రగ్స్ పట్టు పడుతూనే ఉంది. డ్రగ్స్ ఆరికట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నా, పుట్టగొడుగుల పుట్టుకొస్తూనే ఉన్నాయి. తాజాగా గచ్చిబౌలిలోని ఓ స్టార్ హోటల్‌లో కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
హైదరాబాద్ మహా నగరంలో మాదక ద్రవ్యాల వాడకం విచ్చలవిడిగా పెరుగుతోంది. పోలీసులు ఎంత నిఘాద పెట్టిన ఎక్కడో ఒక దగ్గర డ్రగ్స్ పట్టు పడుతూనే ఉంది. డ్రగ్స్ ఆరికట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నా, పుట్టగొడుగుల పుట్టుకొస్తూనే ఉన్నాయి. తాజాగా గచ్చిబౌలిలోని ఓ స్టార్ హోటల్‌లో కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ కేసులో ముగ్గురుని అదుపులోకి తీసుకున్న పోలీసులు డ్రగ్స్ ఎక్కడి నుండి వచ్చింది అనే కోణంలో విచారిస్తున్నారు.
డ్రగ్స్ ప్రస్తుతం నగర వ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. ఓవైపు డ్రగ్స్ కుదరకపోతే గంజాయి. ఇలా ఏదో ఒక రూపంలో మాదక ద్రవ్యాలు రోజు పట్టుబడుతూనే ఉన్నాయి. గచ్చిబౌలిలోని ఒక స్టార్ హోటల్లో పార్టీ చేసుకునేందుకు వచ్చిన ముగ్గురు వ్యక్తులు కోకైన్ సేవిస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు సోదాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అయితే వీరిలో ఒకరిని భారతీయ జనతా పార్టీ నేత, వ్యాపారవేత్త కుమారుడు యోగానందగా గుర్తించారు పోలీసులు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు.
వీరు ఈ కొకైన్‌ను ఎక్కడి నుండి తెప్పించుకున్నారు. ఎవరు ఇచ్చారు. ఎక్కడి నుండి వచ్చింది అనే కోణంలో విచారణ చేస్తున్నారు పోలీసులు. ఇటీవల కాలంలో ఓ హీరో ప్రియురాలి వద్ద నుండి పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. తాజాగా ఓ రాజకీయ కుమారుడు నుంచి కోకైన్ స్వాధీనం చేసుకోవడం కలకలం రేపుతోంది. మరోవైపు ఇటీవల యూట్యూబర్ షణ్ముఖ జస్వంత్ గంజాయి సేవిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబట్టారు. ఈ విధంగా నగరంలో ఏదో ఒక మూలన పబ్స్, రెస్టారెంట్లు అపార్ట్‌మెంట్స్ అని తేడా లేకుండా వివిధ కారణాలతో డ్రగ్స్ కు బానిసలుగా మారారు కొందరు వ్యక్తులు.
పోలీసులు ఎంతటి నిఘా పెట్టినా మాదకతవ్యాలను సేవించే వారి తీరులో మాత్రం మార్పు రావడం లేదు దీంతో పూర్తిస్థాయిలో పోలీసులు డ్రగ్ పెడర్లను, కన్జ్యూమ్ చేసే వ్యక్తులపై ఫోకస్ పెట్టారు. ఈ విధంగా పక్కా సమాచారాలతో సోదాలు నిర్వహించి వారి వద్ద పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకుంటున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…