Road Accident:ఘోర ప్రమాదం.. అతి వేగం ఐదుగురు ప్రాణాలను మింగేసింది.. మరో ఇద్దరికి సీరియస్
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చి అదుపుతప్పిన కారు.. బైక్, లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. మదనపల్లి మండలం బార్లపల్లి దగ్గర ఘటన చోటు చేసుకుంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

బార్లపల్లి వద్ద వేగంగా దూసుకువచ్చిన స్కార్పియో వాహనం అదుపుతప్పి రోడ్డుపై వెళ్తున్న బైక్‌తోపాటు లారీని బలంగా ఢీకొంటింది. దీంతో బైక్ పై ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అయితే వేగంగా వచ్చిన స్కార్పియో వాహనం కంట్రోల్ కాక అదుపు తప్పి పల్టీలు కొట్టింది. దీంతో ఎదురుగా వస్తున్న మరో లారీని ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మృతులను బార్లపల్లి గ్రామానికి చెందిన ఇద్దరుగా గుర్తించారు. స్కార్పియో వాహనంలో ప్రయాణిస్తూ మృతి చెందిన మరో ముగ్గురు వ్యక్తులను గుర్తించాల్సి ఉంది.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…