Viral News: స్మార్ట్‌ఫోన్‌కు బదులుగా గ్లాస్ స్లాబ్.. యువకుడిని బురిడీ కొట్టించిన కేటుగాడు
మంచి స్మార్ట్ ఫోన్ రూ. 34 వేలు.. అర్జంటుగా డబ్బు అవసరం ఉంది.. తక్కువ ధరకే ఇస్తానని చెప్పి ఓ కేటుగాడు యువకుడిని మోసగించాడు..
మంచి స్మార్ట్ ఫోన్ రూ. 34 వేలు.. అర్జంటుగా డబ్బు అవసరం ఉంది.. తక్కువ ధరకే ఇస్తానని చెప్పి ఓ కేటుగాడు యువకుడిని మోసగించాడు. హర్యానాలోని గురుగ్రామ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. రోహిణి ప్రాతంలో నివసిస్తున్న మిశ్రా అనే యువకుడు గురుగ్రామ్‌లోని సెక్టార్ 43 లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. సోమవారం మిశ్రా హుడా సిటీ సెంటర్ మెట్రో స్టేషన్ వెళ్లేందుకు సెక్టార్ 43లో ఆటో రిక్షా కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో స్కూటర్ మీద వచ్చిన కేటుగాడు ఆ యువకుడిని అడ్డగించి తాను ఒక మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలో పనిచేస్తున్నానని, తనకు అత్యవసరంగా డబ్బు అవసరం ఉందని, తన వద్ద ఉన్న రూ. 34 వేల స్మార్ట్ ఫోనును తక్కువ ధరకే ఇస్తున్నట్టు చెప్పాడు. దీంతో బాధిత యువకుడు రూ. 9 వేలకు డీల్ మాట్లాడుకొని ఆ ఫోనును కొనుగోలు చేశాడు. తీరా ఫోన్ కొని బాక్స్ తీసేలోపే ఆ కేటుగాడు అక్కడి నుంచి ఉడాయించాడు. తాను బాక్స్ తీసేందుకు ఎంత ప్రయత్నించినా అది తెరుచుకోలేదని బాధిత యువకుడు చెప్పాడు. సీల్ ఉన్న బాక్స్‌ను తీసేందుకు కనీసం 10 నిమిషాలు పడుతుందని, తీరా తీసి చూస్తే అందులో గ్లాస్ స్లాబ్ ఉందని వాపోయాడు. దీనిపై స్పందించిన పోలీసులు పాత నేరస్తుల రికార్డలను, సీసీటీవీలను పరిశీలిస్తున్నారు. ఇలాంటి మోసాలపై ఎంత ప్రచారం కల్పించినా పునరావృత్తం అవుతున్నయాని పోలీస్ కమిషనర్ కెకె రావు అన్నారు.
Read this also: Viral News: వాష్ రూమ్‌కి వెళ్లొచ్చేసరికి బ్యాగ్ మాయం.. టవల్‌తోనే పోలీస్ స్టేషన్‌కు.. చివరకు