Andhra Pradesh: వెంటాడి వేటాడి చంపి బ్రోటన వ్రేలు తీసుకెళ్లిన దుండగులు.. ఎందుకో తెలుసా..?
అతను ఒక సామాన్య రైతు.. ప్రతి రోజూ పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లేవాడు. ఎప్పటిలాగే ఆ రోజు వెళ్లాడు. తిరిగి ఇంటికి మాత్రం రాలేదు. ఏంటా అని ఆరా తీస్తే అతని మృతదేహం ముళ్ల పొదల్లో పడేసి ఉంది. మోటార్ బైక్‌ను దహనం చేశారు. అంతేకాదు.. అతని చేతివేలుకు ఉండాల్సిన బ్రోటన వ్రేలు కూడా లేదు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టారు.
అతను ఒక సామాన్య రైతు.. ప్రతి రోజూ పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లేవాడు. ఎప్పటిలాగే ఆ రోజు వెళ్లాడు. తిరిగి ఇంటికి మాత్రం రాలేదు. ఏంటా అని ఆరా తీస్తే అతని మృతదేహం ముళ్ల పొదల్లో పడేసి ఉంది. మోటార్ బైక్‌ను దహనం చేశారు. అంతేకాదు.. అతని చేతివేలుకు ఉండాల్సిన బ్రోటన వ్రేలు కూడా లేదు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టారు.
అధునిక యుగంలో చేతబడి అనుమానం అతని ప్రాణాన్ని తీసింది. ఏం జరిగిందో ఎవరూ చంపారో తెలియదు కానీ, అతని వ్రేలు మాయం కావటం వెనుక కచ్చితంగా చేతబడి చేస్తున్నారన్న అనుమానంతో చంపినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ దిశగా దర్యాప్తు చేపట్టారు.
ఈపూరు మండలం మాలపాడుకు చెందిన తులసీ నాయక్ ఇంటిలో అమ్మవారి పూజ చేస్తాడు. అమ్మవారు తనకు వంటిపైకి వస్తుందని ఆ సమయంలో సమస్యల పరిష్కారం కోసం వచ్చే వారికి తాయత్తులు కూడా వేస్తుంటాడు. అయితే కొద్దీ రోజుల క్రితం అతని బంధువు ఒకరు చనిపోయారు. దీంతో తులసీ నాయక్ చేతబడి చేయడంతోనే చనిపోయి ఉంటాడన్న ప్రచారం జరిగింది. మాలపాడులో ఉంటూనే తన స్వగ్రామంలో బోర్లలో నీరు రాకపోవడంతో పక్కనే ఉన్న బొల్లాపల్లి మండలం అగ్ని గుండాలలో మిర్చి పంట వేశాడు. దీంతో ప్రతి రోజూ అక్కడికి వెళ్లి నీరు పెట్టి వస్తుంటాడు.
ఈ క్రమంలోనే ఫిబ్రవరి 21వ తేదిన కూడా తులసీ నాయక్ పొలానికి వెళ్లాడు. అయితే తిరిగి రాలేదు. అగ్ని గుండాల సమీపంలోనే తులసీ నాయక్ ను చంపి ముళ్ల పొదల్లో పడేశారు గుర్తు తెలియని దుండగులు. అక్కడికి సమీపంలోనే తులసీ నాయక్ బైక్ ను పెట్రోలు పోసి తగులబెట్టారు. కూలీ పనులు నిమిత్తం వెళ్లిన స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పారు. రంగంలోకి దిగిన పోలీసులు పరిసరాలను గమనించి తులసీ నాయక్‌ది హత్యగా నిర్ధారించారు. అయితే తులసీ నాయక్ బ్రోటనవ్రేలు లేకపోవడంతో చేతబడి హత్యగా నిర్ధారించారు. చంపిన తర్వాత బ్రోటన వ్రేలు తీసేస్తే మంత్ర శక్తులు పోతాయన్న నమ్మకంతోనే ఈవిధంగా చేస్తారన్న భావన వ్యక్తం అవుతోంది. దీంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. తులసీ నాయక్ భార్యను విచారించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామంటున్నారు పోలుసులు..
అయితే చేతబడి అన్న అనుమానంతో హత్య చేయడంతో నర్సరావుపేట డిఎస్పీ వర్మ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. చేతబడులు లేవని స్థానికులు మూడు నమ్మకాలను నమ్మవద్దని విజజ్ఞప్తి చేశారు. అటువంటి అనుమానాలుంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. చట్టవిరుద్దమైన కార్యక్రమాలు చేసి జైలు పాలు కావద్దని సూచించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…