AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: 24 ఏళ్లుగా వినియోగంలో లేని ఆసుపత్రి లిఫ్ట్‌.. తీరా తెరిచి చూస్తే భయంకరమైన దృశ్యం..

Viral News: ఉత్తర ప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలోని కైలీలో ఉన్న ఓపెక్‌ అనే ఆసుపత్రిలో వెలుగు చూసిన ఓ సంఘటన ఒక్కసారిగా భయాందోళనకు గురి చేసింది. చాలా కాలం పాటు...

Viral News: 24 ఏళ్లుగా వినియోగంలో లేని ఆసుపత్రి లిఫ్ట్‌.. తీరా తెరిచి చూస్తే భయంకరమైన దృశ్యం..
Narender Vaitla
|

Updated on: Sep 06, 2021 | 3:32 PM

Share

Viral News: ఉత్తర ప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలోని కైలీలో ఉన్న ఓపెక్‌ అనే ఆసుపత్రిలో వెలుగు చూసిన ఓ సంఘటన ఒక్కసారిగా భయాందోళనకు గురి చేసింది. చాలా కాలం పాటు పనిచేయకుండా ఉన్న ఓ లిఫ్ట్‌ను తెరిచి చూసేసరికిగుర్తి తెలియని ఓ వ్యక్తి ఆస్థిపంజరం బయటపడింది. సెప్టెంబర్‌ 1న వెలుగులోకి వచ్చిన ఈ వార్త ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇంతకీ ఆ ఆస్థిపంజరం ఎవరన్న దానిపై పోలీసులు విచారణ ప్రారంభించారు.

వివరాల్లోకి వెళితే.. కైలిలో 500 మంచాల సామర్థ్యం ఉన్న ఆసుపత్రి నిర్మాణాన్ని 1991లో ప్రారంభించారు. అయితే ఈ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన లిఫ్ట్‌ 1997 వరకు పనిచేసింది.. ఆ తర్వాత నిర్వాహణ లేకపోవడంతో ఆగిపోయింది. అప్పటి నుంచి లిఫ్ట్‌ జోలికి ఎవరూ పోలేదు. ఇదిలా ఉంటే తాజాగా 24 ఏళ్ల తర్వాత ఆసుపత్రి వర్గాలు లిఫ్ట్‌ను ఇటీవల తిరిగి తెరిచేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలోనే లిఫ్ట్‌ కింద వారికి ఓ ఆస్థిపంజరం లభించింది. పోలీసుల ప్రాథమిక విచారణలో ఆ ఆస్తిపంజరం మగ వ్యక్తిగా తేలింది. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఫోరెన్సిక్‌ నిపుణులు డీఎన్‌ఏ పరీక్షకు పంపించారు. ఇక విచారణ ప్రారంబించిన పోలీసుల 24 ఏళ్ల క్రితం తప్పినపోయిన కేసులు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో పరిశోధన ప్రారంభించారు.

Viral News

ఇక ఈ ఆస్థిపంజరంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ ఆ వ్యక్తి లిఫ్ట్‌లో ఇరుక్కు పోవడం వల్ల మరణించాడా.? లేదా ఎవరైనా హత్య చేశారా? అన్నది పెద్ద మిస్టరీగా మారింది. డీఎన్ఏ రిపోర్ట్‌లు వచ్చిన తర్వాతే పూర్తి విషయాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈ విషయమై బస్తీ సూపరిండెంట్‌ దీపేంద్ర నాథ్‌ చౌదనీ మాట్లాడుతూ.. ‘ఈ కేసు విషయమై ఎవరైనా రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తాం. ప్రస్తుతం ఈ మిస్టరీని చేధించడానికి పలు కోణాల్లో విచారణ చేపడుతున్నాం. ఈ ఆస్థిపంజరం ఎవరిదనే విషయాన్ని తెలుసుకునేందుకు గాను జిల్లా వ్యాప్తంగా ఉన్న 24 స్టేషన్లకు చెందిన పోలీసులు రంగంలోకి దిగారు’ అని చెప్పుకొచ్చారు.

Also Read:

ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌ కూర్పుపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌ కూర్పుపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!