Crime News: ఢిల్లీలో దారుణం.. మత్తుమందు ఇచ్చి వైద్యురాలిని అత్యాచారం చేసిన ఎయిమ్స్ డాక్టర్..
దేశ రాజధానిలో మహిళలపై అకృత్యలు తగ్గడం లేదు. ప్రతి రోజూ ఏదో ఒక చోట అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటికే దాదాపు 1200 పైగా అత్యాచార సంఘటనలు జరిగాయి. నిందితుల్లో 60 శాతం మంది బాధిత యువతులకు తెలిసినే వారు ఉంటున్నారు.
దేశ రాజధానిలో మహిళలపై అకృత్యలు తగ్గడం లేదు. ప్రతి రోజూ ఏదో ఒక చోట అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటికే దాదాపు 1200 పైగా అత్యాచార సంఘటనలు జరిగాయి. నిందితుల్లో 60 శాతం మంది బాధిత యువతులకు తెలిసినే వారు ఉంటున్నారు. తాజాగా వైద్యడే సహచర వైద్యురాలిని అత్యాచారం చేశాడు. ఢిల్లీ హౌస్ ఖాస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు వివరాలు వెల్లడించారు. సెప్టెంబర్ 26న ఎయిమ్స్‌లో పనిచేస్తున్న ఒక సీనియర్ రెసిడెంట్ డాక్టర్ ఇంటిలో పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు సహచర వైద్యులతో కలిసి ఓ మహిళా డాక్టర్ హాజరయ్యారు.
రెసిడెంట్ డాక్టర్.. పార్టీ చివరిలో కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి మహిళా వైద్యురాలికి ఇచ్చారు. అది తాగిన ఆమె సృహతప్పిన పోడిపోయారు. ఆ తర్వాత ఆమెను డాక్టర్ అత్యాచారం చేశాడు. ఈ విషయమై మహిళా వైద్యురాలు ఫిర్యాదు చేయడానికి భయపడింది. కొన్ని రోజుల తర్వాత కొద్ది మంది మిత్రుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడు మరుసటి రోజు నుంచి కనిపించకుండా పోయాడు. సెప్టెంబర్ 27 నుంచి నిందితుడు విధులకు హాజరు కావడంలేదని ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి. వైద్య పరీక్షల్లో మహిళా డాక్టర్‌పై అత్యాచారం జరిగినట్లు ధృవీకరణ అయింది. దీంతో నిందితుడిపై ఐపీసీ 376,377 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అయితే దేశ రాజధానిలో మహిళలకు భద్రత లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. పోలీసుల లెక్క ప్రకారం.. ఢిల్లీలో ప్రతీ రోజూ కనీసం నలుగురు మహిళలు అత్యాచారానికి గురవుతున్నారని తెలుస్తుంది. ఈ ఏడాది జనవరి 1 నుంచి అగస్టు 15 వరకు ఢిల్లీలో 1,231 అత్యాచార ఘటనలు జరిగాయి. గతేడాది ఇదే కాలంలో 908 అత్యాచార ఘటనలు జరిగాయి. 2020లో ఢిల్లీలో 1699 అత్యాచార ఘటనలు నమోదయ్యాయి. అయితే నిందితుల్లో 60 శాతం మంది బాధిత యువతులకు పరిచయస్తులే ఉంటున్నారు. వీరు పక్కింటివారో, కుటుంబ సభ్యుడో, బంధువో, స్నేహితుడో అయి ఉంటున్నారు. నిందితుల్లో కనీసం 2 శాతం మంది తోటి ఉద్యోగులే ఉంటున్నారు. నమ్మిన వ్యక్తులే అఘాయిత్యాలకు ఒడిగడుతుండటంతో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. తాజాగా జరిగిన అత్యాచార ఘటన ఉన్నతమైన వైద్య వృత్తిలో ఉన్న వ్యక్తి చేయడం.. అదీ కూడా ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్ డాక్టరే అవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది.
Read Also.. Andhra Pradesh: నిద్రిస్తోన్న భర్త మర్మాంగంపై సల సలా కాగుతోన్న వేడినీళ్లు పోసిన భార్య…