Gold Seized: మణిపూర్‌లో 43 కిలోల బంగారం పట్టివేత.. 18 గంటలు శ్రమించి బయటకు తీసిన అధికారులు..
21 Crore Gold Seized: మణిపూర్‌లోని ఇంపాల్‌లో భారీగా బంగారం పట్టుబడింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారుల తనిఖీల్లో రూ.20.95 కోట్లు విలువ చేసే బంగారాన్ని
21 Crore Gold Seized: మణిపూర్‌లోని ఇంపాల్‌లో భారీగా బంగారం పట్టుబడింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారుల తనిఖీల్లో రూ.20.95 కోట్లు విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ మొత్తం 43 కిలోలు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. బంగారం అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులకు ముందే సమాచారం అందడంతో తనిఖీలను ముమ్మరం చేసినట్లు అధికారులు వెల్లడించారు. దీనిలో భాగంగా ఓ కారును ఆపి తనిఖీ చేయగా అక్రమ రవాణా బయటపడింది. కారులో ఏర్పాటు చేసిన ప్రత్యేక అరల్లో మొత్తం 260 బంగారం బిస్కెట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటిని కారు నుంచి బయటకు తీసేందుకు చాలా సమయం పట్టిందని అధికారులు తెలిపారు.
దాదాపు 18 గంటల సమయం పట్టడంతో.. అందులో బంగారం ఉందా లేదా అనే అనుమానం కలిగిందన్నారు. చివరకు 260 బంగారం బిస్కెట్లను వెలికితీశారు. ఇదే వాహనాన్ని గతంలో స్మగ్లింగ్‌కి కూడా వినియోగించినట్లు అధికారులు గుర్తించారు. అనంతరం వాహనాన్ని స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. బంగారం స్మగ్లింగ్ గురించి సమాచారం రావడంతో డీఆర్ఐ గౌహతి జోనల్ యూనిట్ ఆపరేషన్ చేపట్టింది. ఇంఫాల్ నగరానికి సమీపంలో జూన్ 16న ఉదయం తెల్లవారుజామున వాహనాన్ని ఆపి తనిఖీలు చేపట్టారు.
మయన్మార్ సరిహద్దుల్లో ఉన్న మణిపూర్‌లో బంగారం అక్రమ రవాణాపై డీఆర్ఐ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. గత మూడు నెలల్లో 67 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంట్లో 55 కిలోల బంగారం ఒక్క జూన్ నెలలోనే పట్టుబడడం గమనార్హం.