Crime News: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం.. ఆటో, పొక్లెయిన్ ఢీకొని.
Kadapa Road Accident: ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పొక్లేయిన్, ఆటో ఢికొని ముగ్గురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరికి
Kadapa Road Accident: ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పొక్లేయిన్, ఆటో ఢికొని ముగ్గురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన జిల్లాలోని ముదిరెడ్డిపల్లి సమీపంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. ముదిరెడ్డిపల్లి సమీపంలో ఆటో, పొక్లెయిన్ ఎదురెదురుగా ఢీకొన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మృతులందరూ రోజువారి కూలీలుగా గుర్తించారు. సమచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను కూడా పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: