Pattabhi: టీడీపీ నేత పట్టాభికి 14 రోజుల రిమాండ్.. బెయిల్ నిరాకరించిన కోర్టు.. మచిలీపట్నం జైలుకు..
TDP Leader Pattabhi: సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభికి విజయవాడ మూడవ అదనపు చీఫ్ మెట్రోపాలిటిన్ కోర్టు న్యాయమూర్తి
TDP Leader Pattabhi: సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభికి విజయవాడ మూడవ అదనపు చీఫ్ మెట్రోపాలిటిన్ కోర్టు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. నవంబర్ 2 వరకు టీడీపీ నేత పట్టాభికి రిమాండ్ విధిస్తూ కోర్టు వెల్లడించింది. బుధవారం పట్టాభి అరెస్ట్ అనంతరం ఆయన తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు మూడవ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు పట్టాభిని హాజరు పర్చారు. ఈసందర్భంగా పట్టాభి మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యల పై న్యాయమూర్తి కి వివరణ ఇచ్చారు. ఇప్పటికే తన ఇంటిపై పలుమార్లు దాడిచేశారని పేర్కొన్నారు. తాను సీఎంని గానీ ప్రభుత్వంలో ఉన్న వారిని గానీ వ్యక్తిగతంగా విమర్శించ లేదని పేర్కొన్నారు. కేవలం ప్రభుత్వంలో ఉన్న లోపాలను మాత్రమే మీడియాలో ప్రస్తావించానంటూ న్యాయమూర్తికి పట్టాభి వివరించారు. ఇప్పటికే తన ఇంటిపై పలుమార్లు దాడిచేశారని జడ్జికి వివరించారు. తనకు, తన కుటుంబానికి ప్రాణ హాని ఉందంటూ పట్టాభి న్యాయమూర్తికి తెలిపారు.
తాను విద్వేషాలు రెచ్చ గొట్టేలా మాట్లాడలేదని.. తన ప్రెస్ మీట్ వీడియో క్లిప్పింగ్ పరిశీలించాలంటూ పట్టాభి న్యాయమూర్తిని వేడుకున్నారు. తనకు నోటీస్ ఇవ్వకుండా నే రాత్రి 9.30 గంటల సమయంలో అరెస్ట్ చేశారని తెలిపారు. కాన్ఫెషన్ స్టేట్మెంట్లో మధ్యవర్తులు లేకుండానే తనతో పోలీసులు బలవంతంగా సంతకం చేయించారు అంటూ న్యాయమూర్తి కి పట్టాభి వివరించారు. అనంతరం పట్టాభిని.. మచిలీపట్నం జిల్లా జైలుకు తరలించారు.
Also Read: