Sajjala: టీడీపీ లైన్‌ దాటింది.. ఏమైనా జరిగితే చంద్రబాబుదే బాధ్యత: సజ్జల రామకృష్ణారెడ్డి

టీడీపీ లైన్‌ దాటింది.. ఏమైనా జరిగితే చంద్రబాబుదే బాధ్యత అని తేల్చి చెప్పేశారు ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.

Sajjala: టీడీపీ లైన్‌ దాటింది.. ఏమైనా జరిగితే చంద్రబాబుదే బాధ్యత: సజ్జల రామకృష్ణారెడ్డి
Sajjala
Follow us

|

Updated on: Oct 21, 2021 | 2:11 PM

Sajjala Ramakrishna Reddy: టీడీపీ లైన్‌ దాటింది.. ఏమైనా జరిగితే చంద్రబాబుదే బాధ్యత అని తేల్చి చెప్పేశారు ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారాయన. మంగళగిరిలో నేటి చంద్రబాబు దీక్ష, అనంతరం ఢిల్లీ పర్యటనపై స్పందించిన సజ్జల.. మేం కూడా ఢిల్లీకి వెళ్తాం.. టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం అన్నారు.

బూతులు మాట్లాడే హక్కు కోసం టీడీపీ ధర్నాలు చేస్తుందని సజ్జల మండిపడ్డారు. దాడి చేయటం తప్పే.. కానీ, ఆ ఆగ్రహానికి కారణం ఎవరు? అని ప్రశ్నించారు. మిగిలిన పార్టీలు కూడా ఇటువంటి కుసంస్కార మాటలపై తమ వైఖరి ఏంటో స్పష్టం చేయాలన్న ఆయన.. ఇలా బూతులు మాట్లాడటం తప్పు కాదంటే అదే విషయం చెప్పాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజామోదం ఏ రకంగా ఉందో అందరూ చూశారన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.

సభ్య సమాజంలో ఉండే హక్కును చంద్రబాబు, టీడీపీ కోల్పోయారని సజ్జల చెప్పుకొచ్చారు. ఇటువంటి దౌర్భాగ్యపు పార్టీ నేతృత్వంలో ఈ రాష్ట్రం కొన్ని సంవత్సరాల పాటు ఉన్నందుకు రాష్ట్ర ప్రజలు సిగ్గు పడుతున్నారన్నారు. ఇటువంటి వ్యాఖ్యల చేయించినందుకు చంద్రబాబు.. ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నది మా ఏకైక డిమాండ్ అన్నారు. ఇక, చంద్రబాబు ఢిల్లీ వెళ్తే మేం కూడా వెళ్తాం.. టీడీపీ గుర్తింపు రద్దు చేయమని ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తాం అని సజ్జల వెల్లడించారు.

Read also: YSRCP: స్టేట్‌ వైడ్‌గా జనాగ్రహ దీక్షలు.. అంతకు మించి అన్నట్టుగా వైసీపీ కార్యకర్తల ప్రదర్శనలు