మరో ఉన్నావ్ ఘటన.. యువతిపై అత్యాచారం, ఆపై నిప్పు..
నిర్బయ.. ఉన్నావ్.. దిశ.. ఇలా ఎంతోమంది అబలలు కామాంధుల చేతులో బలైపోతూనే ఉన్నారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడేవారి కోసం ఆయా ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకొస్తున్నా.. ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. ఇక తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఉన్నావ్‌ను తలపించే విధంగా మరో ఘోరం చోటు చేసుకుంది. 18 ఏళ్ళ యువతిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడి.. ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ దారుణం ఫతేపూర్ జిల్లాలోని హుస్సేన్ గంజ్‌లో జరిగింది. ప్రస్తుతం బాధితురాలు 90% […]
నిర్బయ.. ఉన్నావ్.. దిశ.. ఇలా ఎంతోమంది అబలలు కామాంధుల చేతులో బలైపోతూనే ఉన్నారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడేవారి కోసం ఆయా ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకొస్తున్నా.. ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. ఇక తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఉన్నావ్‌ను తలపించే విధంగా మరో ఘోరం చోటు చేసుకుంది. 18 ఏళ్ళ యువతిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడి.. ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ దారుణం ఫతేపూర్ జిల్లాలోని హుస్సేన్ గంజ్‌లో జరిగింది. ప్రస్తుతం బాధితురాలు 90% కాలిన గాయాలతో కాన్పూర్ ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. కాగా, నిందితుడు ఆమెకు దూరపు బంధువు. యువతి ఒంటరిగా ఉన్న సమయంలో ఈ మృగాడు ఘటాకానికి పాల్పడ్డాడు.
కొద్దిరోజుల కిందట బాధిత యువతితో నిందితుడు సన్నిహితంగా మెలగడం చూసి.. బంధువులు పట్టుకుని పంచాయితీ ముందు పెట్టారు. ఇరు కుటుంబ సభ్యులు ఒక నిర్ణయానికి వచ్చి.. ఇద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయించారు. అయితే అనుకోని విధంగా ఆ కిరాతకుడు ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసుల ప్రాధమిక విచారణలో తేలింది. కాగా, వారు ఈ కోణంలో దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఇక యూపీలో రోజుకో తరహాలో మహిళలపై ఘోరాలు జరుగుతుండటంతో యోగీ సర్కార్‌పై విమర్శలు వెల్లువెత్తాయి.