బిర్యానీ అమ్ముతున్నాడని దళితుడిపై దాడి..

ప్రపంచం ఎంత ముందుకు వెళ్తున్నా కుల జాడ్యం మాత్రం వీడటం లేదు. దేశ రాజధాని ఢిల్లీ సమీపంలో అమానుష ఘటన చోటుచేసుకుంది.  దళిత వ్యక్తి  బిర్యానీ అమ్ముతున్నాడని అతనిపై కొందరు వ్యక్తులు దాడిచేశారు.  గ్రేటర్‌ నోయిడాలోని రబుపురాలో ఈ దారుణం చోటుచేసుకుంది.  ఘటన సంబంధించి వీడియో దృశ్యాలు ఎవరో రికార్డు చెయ్యడంతో అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 43 ఏళ్ల దళిత వ్యక్తి లోకేశ్‌ను కులం పేరుతో కొందరు తిడుతున్నట్లు, కొడుతున్నట్లుగా ఉన్న దృశ్యాలు […]

బిర్యానీ అమ్ముతున్నాడని దళితుడిపై దాడి..
Follow us
Ram Naramaneni

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 15, 2019 | 3:21 PM

ప్రపంచం ఎంత ముందుకు వెళ్తున్నా కుల జాడ్యం మాత్రం వీడటం లేదు. దేశ రాజధాని ఢిల్లీ సమీపంలో అమానుష ఘటన చోటుచేసుకుంది.  దళిత వ్యక్తి  బిర్యానీ అమ్ముతున్నాడని అతనిపై కొందరు వ్యక్తులు దాడిచేశారు.  గ్రేటర్‌ నోయిడాలోని రబుపురాలో ఈ దారుణం చోటుచేసుకుంది.  ఘటన సంబంధించి వీడియో దృశ్యాలు ఎవరో రికార్డు చెయ్యడంతో అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 43 ఏళ్ల దళిత వ్యక్తి లోకేశ్‌ను కులం పేరుతో కొందరు తిడుతున్నట్లు, కొడుతున్నట్లుగా ఉన్న దృశ్యాలు వీడియోలో క్లియర్‌గా కనిపిస్తున్నాయి.

శుక్రవారం జరిగిన ఈ  ఘటన  ఆదివారం వెలులోకి వచ్చింది. చాలాసార్లు వద్దని హెచ్చరించినా కూడా బిర్యానీ అమ్ముతున్నాడనే కారణంతోనే వారు దాడికి పాల్పడినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. సెన్సిటీవ్ ఇష్యూ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.  కాగా ఘటనపై ప్రముఖ నటి  ఊర్మిళా మటోండ్కర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటరానితనం పాటించడం మన సంస్కృతి కాదని.. ‘సబ్‌ కా సాథ్‌..సబ్‌ కా వికాస్‌ ‘ ‘సిద్దాంతానికి పూర్తి విరుద్దమని ట్వీట్ చేశారు.