నిర్భయ దోషుల్లో చావు భయం.. తిండి మానేసి..

నిర్భయ కేసులోని నలుగురు నిందితులకు మృత్యువు దగ్గర పడింది. ఈ నెల 17న వారిని ఉరి తీయడానికి తీహార్ జైలు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సంబంధిత కోర్టు ఫారం నెంబర్.42 లేదా బ్లాక్ వారెంట్/ డెత్ వారెంట్ జారీ చేయనుంది. ఒక నేరస్తుడికి మరణ శిక్ష విధించాలంటే ‘బ్లాక్ వారెంట్’ తప్పనిసరి. ఇప్పటికే ఈ నిందితుల్లో ఒకరు రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరగా.. మరొకరు కోర్టు తీర్పును పునః పరిశీలించాలంటూ సుప్రీంలో రివ్యూ పిటీషన్ […]

  • Ravi Kiran
  • Publish Date - 3:31 pm, Sun, 15 December 19
నిర్భయ దోషుల్లో చావు భయం.. తిండి మానేసి..

నిర్భయ కేసులోని నలుగురు నిందితులకు మృత్యువు దగ్గర పడింది. ఈ నెల 17న వారిని ఉరి తీయడానికి తీహార్ జైలు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సంబంధిత కోర్టు ఫారం నెంబర్.42 లేదా బ్లాక్ వారెంట్/ డెత్ వారెంట్ జారీ చేయనుంది. ఒక నేరస్తుడికి మరణ శిక్ష విధించాలంటే ‘బ్లాక్ వారెంట్’ తప్పనిసరి. ఇప్పటికే ఈ నిందితుల్లో ఒకరు రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరగా.. మరొకరు కోర్టు తీర్పును పునః పరిశీలించాలంటూ సుప్రీంలో రివ్యూ పిటీషన్ దాఖలు చేశాడు. కాగా, కోర్టు లేదా రాష్ట్రపతి దోషులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలనుకున్నప్పుడు బ్లాక్ వారెంట్‌ను జారీ చేస్తారు.

బ్లాక్ వారెంట్ ఏం చెబుతోంది….

బ్లాక్ వారెంట్‌ అంటే ‘వారెంట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ సెంటెన్స్ ఆఫ్ డెత్’ అని అర్ధం. దీనిని ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే ఒక దోషిని ఉరి తీయడానికి సంబంధిత కోర్టు జైలు సూపరింటెండెంట్‌కు ఈ వారెంట్‌ను పంపుతుంది. ఇక అప్పుడు అధికారి దోషులను ఉరి తీసే సమయం నిర్ణయించి కోర్టుకు వివరిస్తాడు. ఒకసారి కోర్టు డెత్ వారెంట్ జారీ చేసిన అనంతరం.. ఆ ఉత్తర్వులను ఎర్రటి ఎన్వలప్‌లో పొందుపరిచి తీహార్ జైలుకు పంపిస్తారు. దీనికి అనుగుణంగానే ఉరి తీయబోయే దోషి కుటుంబానికి కూడా సమాచారాన్ని అందిస్తారు. ఇకపోతే బ్లాక్ వారెంట్ ఒక్కసారి వచ్చిన తర్వాత దోషి ఇక పని చేయడు. అతడిని 24/7 జైలు అధికారులు పర్యవేక్షిస్తుంటారు. అంతేకాకుండా రోజుకి రెండుసార్లు మెడికల్ చెకప్ కూడా చేస్తారు. మరోవైపు బ్లాక్ వారెంట్‌లో ఏ నిందితుడిని ఉరి తీయాలనేది పూర్తిగా వివరించి ఉంటుంది. ‘సంబంధిత నిందితుడిని ఉరి తీయడానికి జారీ అయిన అఫీషియల్ ఉత్తర్వులు.. అతడు చనిపోయేవరకు మెడకు ఉరి తాడు బిగించి ఉంచాలని’ అందులో రాసి ఉంటుంది.