నిర్భయ కేసు దోషులను నేనే ఉరి తీస్తా.. షూటర్ వర్తికా సింగ్

నిర్భయ కేసు దోషులు నలుగురిని తానే ఉరి తీస్తానని ఇంటర్నేషనల్ షూటర్ వర్తికా సింగ్ సంచలన ప్రకటన చేసింది. కీచకులు దారుణంగా, అసభ్యంగా ప్రవర్తిస్తే వారికి మహిళలు మరణ శిక్ష విధించవచ్చుననే సందేశాన్ని ఇచ్చేందుకే.. నిర్భయ దోషులను ఉరి తీసేందుకు తన సంసిధ్దతను తెలియజేస్తున్నానని ఆమె చెప్పారు. వారిని ఉరి తీసేందుకు తనను అనుమతించాలని అంటూ ఆమె రక్తంతో హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. తనకు రాజకీయ నాయకులు, నటీమణులు, సెలబ్రిటీలు, ఇతరులు మద్దతు […]

  • Pardhasaradhi Peri
  • Publish Date - 3:09 pm, Sun, 15 December 19
నిర్భయ కేసు దోషులను నేనే ఉరి తీస్తా.. షూటర్ వర్తికా సింగ్

నిర్భయ కేసు దోషులు నలుగురిని తానే ఉరి తీస్తానని ఇంటర్నేషనల్ షూటర్ వర్తికా సింగ్ సంచలన ప్రకటన చేసింది. కీచకులు దారుణంగా, అసభ్యంగా ప్రవర్తిస్తే వారికి మహిళలు మరణ శిక్ష విధించవచ్చుననే సందేశాన్ని ఇచ్చేందుకే.. నిర్భయ దోషులను ఉరి తీసేందుకు తన సంసిధ్దతను తెలియజేస్తున్నానని ఆమె చెప్పారు. వారిని ఉరి తీసేందుకు తనను అనుమతించాలని అంటూ ఆమె రక్తంతో హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. తనకు రాజకీయ నాయకులు, నటీమణులు, సెలబ్రిటీలు, ఇతరులు మద్దతు ఇవ్వాలని వర్తికా సింగ్ కోరారు.
నిర్భయ దోషులు ప్రస్తుతం తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. వీరి ఉరితీత కోసం ఉరి తాళ్లను సిధ్ధం చేయాలని ఈ జైలు అధికారులు బీహార్ లోని బక్సర్ జైలు సిబ్బందికి లేఖ రాశారు. అలాగే తలారులను పంపవలసిందిగా యూపీ ప్రభుత్వాన్ని కూడా కోరారు. ఉరి తాళ్లను తయారు చేయడంలో బక్సర్ జైలు సిబ్బంది సిధ్ధహస్తులట.. మరోవైపు యూపీలోని మీరట్ లో పవన్ అనే తలారి ఉన్నాడు. ఇతనికి ‘ తలారిసర్టిఫికెట్ ‘ కూడా ఉంది. అటు- నిర్భయ దోషులను ఉరి తీసేందుకు వర్తికా సింగ్ తో బాటు తమిళనాడుకు చెందిన పోలీసు ఎస్.సుభాష్ శ్రీనివాసన్ కూడా సంసిధ్దతను తెలియజేశాడు. ఆయన ఈ నెల 6 నే తీహార్ జైలు అధికారులకు లేఖ కూడా రాశాడు.