గొల్లపూడి మారుతీ రావు అంత్యక్రియలు పూర్తి
గొల్లపూడి మారుతీరావు అంత్యక్రియలు కాసేపటి క్రితమే పూర్తి అయ్యాయి. చెన్నైలోని కన్నమపేటలోని దహనవాటికలో గొల్లపూడి అంత్యక్రియలు జరిగాయి. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మారుతీరావు గురువారం మధ్యాహ్నం కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాగా.. నిన్న మధ్యాహ్నం గొల్లపూడి భౌతిక కాయాన్ని కుటుంబసభ్యులు ఇంటికి తీసుకొచ్చారు. సినీ తారలు, అభిమానుల సందర్శనార్థం ఉంచడంతో.. తెలుగు, తమిళ రంగాలకు చెందిన సినీ ప్రముఖులు నివాళులర్పించారు. 1939 ఏప్రిల్ 14న విజయనగరంలో జన్మించిన గొల్లపూడి మారుతీరావుకి ముగ్గురు కుమారులు. ‘ఇంట్లో రామయ్య – […]
గొల్లపూడి మారుతీరావు అంత్యక్రియలు కాసేపటి క్రితమే పూర్తి అయ్యాయి. చెన్నైలోని కన్నమపేటలోని దహనవాటికలో గొల్లపూడి అంత్యక్రియలు జరిగాయి. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మారుతీరావు గురువారం మధ్యాహ్నం కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాగా.. నిన్న మధ్యాహ్నం గొల్లపూడి భౌతిక కాయాన్ని కుటుంబసభ్యులు ఇంటికి తీసుకొచ్చారు. సినీ తారలు, అభిమానుల సందర్శనార్థం ఉంచడంతో.. తెలుగు, తమిళ రంగాలకు చెందిన సినీ ప్రముఖులు నివాళులర్పించారు.
1939 ఏప్రిల్ 14న విజయనగరంలో జన్మించిన గొల్లపూడి మారుతీరావుకి ముగ్గురు కుమారులు. ‘ఇంట్లో రామయ్య – వీధిలో క్రిష్ణయ్య’ సినిమాతో ఆయన నటుడిగా పరిచయం అయ్యారు. కాగా.. గొల్లపూడి దాదాపు 250 సినిమాల్లో నటించారు. అంతేకాకుండా.. రచయితగా, విలన్‌గా, సహాయనటుడిగా, హాస్య నటుడిగా ఇలా అన్ని కేటగిరీల్లోనూ ఆయన ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.
అయితే ‘ప్రేమ పుస్తకం’అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తూ గొల్లపూడి చిన్నకుమారుడు శ్రీనివాస్ చనిపోయారు. చిన్న కుమారుడు జ్ఞాపకార్థం గొల్లపూడి శ్రీనివాస స్మారక పురస్కారాన్ని ఏర్పాటు చేశారు గొల్లపూడి. తండ్రి బాటలోనే పెద్ద కుమారుడు సుబ్బారావు, రెండో కుమారుడు రామకృష్ణ రచనపై ఆసక్తి పెంచుకున్నారు. ప్రస్తుతం తనయులిద్దరూ ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్నారు.