AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘చెడిపోతే చచ్చిపో’.. ప్రియురాలికి ప్రియుడి మార్గనిర్దేశం!

చెడిపోతే చచ్చిపో అంటూ ఓ ప్రియురాలికి ప్రియుడు మార్గనిర్దేశం చేశాడు. దీంతో.. మనస్తాపం చెందిన ఆ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో చోటుచేసుకుంది. తొమ్మిదో తరగతి చదువుతోన్న విద్యార్థినిపై ఈ నెల 7వ తేదీన రాజు అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. యువతి ఇంటి సమీపంలో డాబాపై పడిపూజ జరుగుతోంది. అక్కడికి విద్యార్థిని తన తోటి స్నేహితులతో కలిసి వెళ్లింది. వీరు వెళ్లడం గమనించిన రాజు […]

'చెడిపోతే చచ్చిపో'.. ప్రియురాలికి ప్రియుడి మార్గనిర్దేశం!
TV9 Telugu Digital Desk
|

Updated on: Dec 16, 2019 | 1:13 PM

Share

చెడిపోతే చచ్చిపో అంటూ ఓ ప్రియురాలికి ప్రియుడు మార్గనిర్దేశం చేశాడు. దీంతో.. మనస్తాపం చెందిన ఆ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో చోటుచేసుకుంది. తొమ్మిదో తరగతి చదువుతోన్న విద్యార్థినిపై ఈ నెల 7వ తేదీన రాజు అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. యువతి ఇంటి సమీపంలో డాబాపై పడిపూజ జరుగుతోంది. అక్కడికి విద్యార్థిని తన తోటి స్నేహితులతో కలిసి వెళ్లింది. వీరు వెళ్లడం గమనించిన రాజు అనే వ్యక్తి.. విద్యార్థిని పక్కకు పిలిచి మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అరవకుండా నోరు మూసేసి అత్యాచారం చేశాడు. అనంతరం ఇది ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో ఎవరికీ చెప్పుకోలేని ఆ బాలిక.. తన బాయ్ ఫ్రెండ్ సుబ్రమణ్యానికి అత్యాచార విషయాన్ని చెప్పింది.

ప్రేమ మనసుకు సంబంధించిందని.. శరీరానికి కాదని మొదట మాయ మాటలు చెప్పిన సుబ్రమణ్యం.. మెల్లమెల్లగా యువతితో మాట్లాడటం తగ్గించాడు. ఏంటని యువతి ప్రశ్నించగా.. చెడిపోయావు చచ్చిపో అంటూ.. తప్పించుకునే ప్రయత్నాలు చేశాడు. దీంతో మనస్తాపం చెందిన యువతి.. ఈ నెల 9న స్కూల్‌కి వెళ్లేటప్పుడు పొలంలోని పురుగుల మందు తాగింది. స్కూల్లోనే వాంతులు చేసుకుని.. కళ్లుతిరిగి పడిపోయింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా.. ప్రయోజనం లేక పోయింది. అయితే.. ఈ విషయంపై విద్యార్థిని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

రంగంలోకి దిగిన పోలీసులు ప్రియుడు సుబ్రమణ్యం, అత్యాచారం చేసిన నిందితుడు రాజుని అదుపులోకి తీసుకుని విచారించగా.. పూస గుచ్చినట్టు అసలు నిజాలు వెల్లడించారు దుర్మార్గులు.

Follow Us
చొక్కాతో అద్దాలు తుడుస్తున్నారా? ఖరీదైన లెన్స్‌ను పాడుచేసుకోకండి!
చొక్కాతో అద్దాలు తుడుస్తున్నారా? ఖరీదైన లెన్స్‌ను పాడుచేసుకోకండి!
మీకు హెచ్ఐవీ రిస్క్‌ ఉందో లేదో QR కోడ్‌తో తెలుసుకోవచ్చు..
మీకు హెచ్ఐవీ రిస్క్‌ ఉందో లేదో QR కోడ్‌తో తెలుసుకోవచ్చు..
శుక్రుడి ఎంట్రీతో జాక్‌పాట్.. ఈ రాశులకు డబ్బే డబ్బు!
శుక్రుడి ఎంట్రీతో జాక్‌పాట్.. ఈ రాశులకు డబ్బే డబ్బు!
స్వరా వాఖ్యలు మహిళలను అవమానించేలా ఉన్నాయని ఆరోపణలు
స్వరా వాఖ్యలు మహిళలను అవమానించేలా ఉన్నాయని ఆరోపణలు
టెస్ట్ క్రికెట్‌లో అంత్యంత చెత్త రికార్డు.. 26 పరుగులకే ఆలౌట్!
టెస్ట్ క్రికెట్‌లో అంత్యంత చెత్త రికార్డు.. 26 పరుగులకే ఆలౌట్!
పెళ్లికి పదేపదే అడ్డంకులా? జ్యోతిష్యంలో చెప్పిన చిట్కాలివే!
పెళ్లికి పదేపదే అడ్డంకులా? జ్యోతిష్యంలో చెప్పిన చిట్కాలివే!
సామాన్యులపై మరో భారం.. ఘాటెక్కిస్తున్న ఉల్లి.. ఇప్పుడు కిలో..
సామాన్యులపై మరో భారం.. ఘాటెక్కిస్తున్న ఉల్లి.. ఇప్పుడు కిలో..
దొంగతనం చేయడానికి వచ్చి.. వెంకటేశ్వరస్వామి ఫోటో కనిపించగానే..
దొంగతనం చేయడానికి వచ్చి.. వెంకటేశ్వరస్వామి ఫోటో కనిపించగానే..
శని దేవుడి అనుగ్రహం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదట!
శని దేవుడి అనుగ్రహం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదట!
ఈసారి అంతకు మించి.. పవన్ కల్యాణ్ 'ఓజీ 2' గ్లింప్స్ చూశారా?
ఈసారి అంతకు మించి.. పవన్ కల్యాణ్ 'ఓజీ 2' గ్లింప్స్ చూశారా?