Coronavirus: థర్డ్ వేవ్ ముప్పు ఇంకా పోలేదు.. ఇదే డేంజర్ సమయం.. తస్మాత్ జాగ్రత్త

థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా 24 గంటల వ్వవధిలో 14వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.

Coronavirus: థర్డ్ వేవ్ ముప్పు ఇంకా పోలేదు.. ఇదే డేంజర్ సమయం.. తస్మాత్ జాగ్రత్త
Coronavirus
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 12, 2021 | 2:22 PM

కరోనా మహమ్మారి మన మధ్యే తిరుగుతోంది. మరోసారి మారణ హోమం సృష్టించేందుకు అదును కోసం ఎదురుచూస్తోంది. మీరెక్కడికి వెళ్లినా కాటేసేందుకు మాటేసి ఉంది. మన చుట్టూ ఉన్నోళ్లే కరోనాను క్యారీ చేస్తున్నారు. నిర్లక్ష్యం వహించారో మిమ్మల్ని మీ కుటుంబాన్నే కబలించేయడం ఖాయం. భారత్‌లో మళ్లీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఏ రోజుకారోజు నెంబర్ పెరిగిపోతోంది. థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా 24 గంటల వ్వవధిలో 14వేలకు పైగా కేసులు నమోదైతే, 181మంది కరోనాకు బలైపోయారు. ఇక, మొత్తం కేసులు 3కోట్ల 40లక్షలకు చేరాయి.

అక్టోబర్, నవంబర్, డిసెంబర్… కరోనా వ్యాప్తి జరిగేది ఈ మూడు నెలల్లోనే ఎక్కువ. ఎందుకంటే ఇది ఫెస్టివ్ సీజన్. గతేడాది కూడా ఈ మూడు నెలల్లోనే సెకండ్ వేవ్‌ మొదలై మారణ హోమం సృష్టించింది. అక్టోబర్‌, నవంబర్, డిసెంబర్‌లోనే అత్యధిక కేసులు నమోదై కోటి మార్క్ దాటేశాయ్. ప్రస్తుతం మూడున్నర కోట్ల మార్క్‌ వైపు దూసుకుపోతున్నాయ్. థర్డ్‌ వేవ్‌ను అడ్డుకోవాలంటే మన ముందున్నది ఒకే ఒక్క మార్గం. దేశంలో కనీసం 60శాతం ప్రజలను వ్యాక్సినేట్ చేయడం. ఈ ఏడాదికి చివరి నాటికి దేశ ప్రజలందరికీ వ్యాక్సినేషన్ వేయాలన్న కేంద్రం టార్గెట్. మరి, ఆ టార్గెట్ రీచ్ అవుతుందా అంటే లేదనే చెప్పాలి. టార్గెట్ ప్రకారం రోజుకి కోటీ 40లక్షల మందికి వ్యాక్సినేషన్ వేయాల్సి ఉండగా… అందులో సగం కూడా కంప్లీట్ కాకపోవడం ఆందోళన కలిగించే విషయం.

మన తెలుగు రాష్ట్రాల్లోనూ మళ్లీ కేసులు పెరుగుతున్నాయ్. దీనికి ప్రధాన కారణం కోవిడ్ రూల్స్‌ని పాటించకపోవడమే. 20శాతం ప్రజలు కూడా మాస్క్‌ ధరించడం లేదని అధ్యయనంలో తేలింది. ఇక, భౌతిక దూరం ఎప్పుడో పక్కనబెట్టేశారు. ఇప్పుడు ఫెస్టివ్ సీజన్ నడుస్తోంది. ఈ నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే కరోనా థర్డ్ రావడం ఖాయమంటున్నారు నిపుణులు. తెలంగాణలో ప్రతిరోజూ 200 నుంచి 250 కేసులు నమోదవుతున్నాయ్. ఒక్క హైదరాబాద్‌లోనే డైలీ 80 నుంచి 100మంది వైరస్‌కు చిక్కుతున్నారు. ప్రతిరోజూ ఒకరిద్దరు చనిపోతున్నారు. ఈ లెక్కల్ని చూసైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు తెలంగాణ DH శ్రీనివాస్.

కరోనా థర్డ్ వేవ్ ముప్పు ఇంకా పొంచే ఉందన్నది WHO, AIMS చేస్తున్న హెచ్చరికలు. సో… జాగ్రత్తలు తీసుకోకపోయినా… కోవిడ్ రూల్స్ పాటించకపోయినా ఈ ఫెస్టివ్ సీజన్ మరోసారి మనల్ని ముంచేయడం ఖాయం. సో బీ కేర్ ఫుల్.

Also Read:  ప్రత్యేకత చాటుకున్న నగరి ఎమ్మెల్యే రోజా.. సీఎం జగన్‎కు ప్రత్యేక శాలువాతో సత్కారం..

ప్రియుడే కావాలన్న భార్య.. వారించినా వినకపోవడంతో భర్త ఏం చేశాడంటే
ప్రియుడే కావాలన్న భార్య.. వారించినా వినకపోవడంతో భర్త ఏం చేశాడంటే
పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!