డాక్ట‌ర్ల‌కు కృత‌జ్ఞ‌త‌గా జూలై 1న హాలీడే: మమ‌త‌

ప్రాణాలకు తెగించి కరోనా మహమ్మారితో ముందు వరసలో ఉండి పోరాటం చేస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది సేవలకు కృత‌జ్ఞ‌త‌గా పశ్చిమ బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం ప్రకటించింది...

డాక్ట‌ర్ల‌కు కృత‌జ్ఞ‌త‌గా జూలై 1న హాలీడే: మమ‌త‌
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 29, 2020 | 8:09 PM

ప్రాణాలకు తెగించి కరోనా మహమ్మారితో ముందు వరసలో ఉండి పోరాటం చేస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది సేవలకు కృత‌జ్ఞ‌త‌గా పశ్చిమ బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం ప్రకటించింది. జూలై 1న రాష్ట్ర సెలవు దినంగా ప్రకటించింది. డాక్టర్స్ డే సందర్భంగా ఆ రోజున సెలవుగా ప్రకటిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. జూలై 1ని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరుతున్నానని చెప్పారు. కరోనా ఫ్రంట్‌లైన్ వారియర్స్ సేవలకు కృత‌జ్ఞ‌త‌గా సెలవు ప్రకటించినట్లు మమతా తెలిపారు.

కరోనా వ్యాప్తిని ఎదుర్కొనేందుకు తమ ప్రభుత్వం పూర్తి సన్నద్ధతతో ఉందని సీఎం మమత బెనర్జీ తెలిపారు. వైరస్‌ నియంత్రణపై ప్రత్యేకంగా దృష్టి సారించామని చెప్పారు. రాష్ట్ర ప్రజల కోసం మూడు కోట్ల మాస్కులు సేక‌రించాల‌ని బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ఆ‌‌ మాస్కుల‌ను రాష్ట్రంలోని వివిధ‌ పాఠ‌శాల‌ల విద్యార్థులు, 100 రోజుల ప‌ని ల‌బ్ధిదారులు, క‌రోనాపై ముందు వ‌రస‌లో నిలిచి పోరాడుతున్న వైద్య సిబ్బంది, పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, క‌రోనా నిర్మూల‌న కోసం స్వచ్ఛందంగా ప‌ని చేస్తున్న పౌర సేవ‌కులకు ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే, ప్రభుత్వాలు ఎన్ని చేసినా… ప్రజలు కూడా సహకరించాలని, ఎవరికీ వారుగా స్వీయ నియంత్రణ చర్యలు పాటించాలని సూచించారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం లాంటివే సురక్షిత మార్గాలని పేర్కొన్నారు.