మెడికల్‌ సిబ్బందిపై రాళ్ళు రువ్విన గ్రామస్థులు.. అంబులెన్స్‌ వాహనం ధ్వంసం..

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు నెలలు గడుస్తున్నప్పటికీ.. ఈ వైరస్‌పై ప్రజల్లో ఇంకా అవగాహన రావడం లేదన్న దానికి కర్ణాటకలో జరిగిన సంఘటన నిదర్శనంగా మారింది.

  • Tv9 Telugu
  • Publish Date - 2:56 pm, Tue, 16 June 20
మెడికల్‌ సిబ్బందిపై రాళ్ళు రువ్విన గ్రామస్థులు.. అంబులెన్స్‌ వాహనం ధ్వంసం..

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు నెలలు గడుస్తున్నప్పటికీ.. ఈ వైరస్‌పై ప్రజల్లో ఇంకా అవగాహన రావడం లేదన్న దానికి కర్ణాటకలో జరిగిన సంఘటన నిదర్శనంగా మారింది. కల్బుర్గి ప్రాంతంలోని తండా గ్రామంలో ఇటీవల ముంబై నుంచి కొందరు వచ్చారు. వారిలో దాదాపు 15 మంది కరోనా బారినపడ్డట్లు అధికారులు
గుర్తించారు. అయితే వారిని ఆస్పత్రికి తరలించేందుకు ఆ గ్రామానికి మెడికల్ సిబ్బంది, అంబులెన్స్‌ వాహనం వెళ్లింది. ముంబై నుంచి వచ్చిన వారు తమ వెంట రావాలంటూ కోరారు. అయితే గ్రామస్థులు మాత్రం తమకు కరోనా లేదంటూ.. తాము ఎక్కడికి వచ్చేది లేదంటూ మొండికేసి కూర్చున్నారు. అంతేకాకుండా.. మెడికల్ సిబ్బందిపై రాళ్ల దాడికి దిగారు. అంబులెన్స్‌తో పాటు.. అక్కడి వచ్చిన పోలీస్ వాహనాలపై రాళ్ల దాడి చేయడంతో.. పలు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో సమాచారం అందుకున్న అధికారులు.. అక్కడికి భద్రతా బలగాలను మోహరించి.. స్థానిక నాయకులతో మాట్లాడి వారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఘటనకు కారణమైన వారిపై కేసులు నమోదు చేశారు.