Breaking: ‘గోకుల్ చాట్’ యజమానికి కరోనా పాజిటివ్.. షాప్ క్లోజ్
హైదరాబాద్‌లోని కోఠిలో పేరు గాంచిన గోకుల్ చాట్ యజమాని విజయా వార్గికి కరోనా సోకింది. ఇటీవల జరిపిన పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌గా తేలింది.
హైదరాబాద్‌లోని కోఠిలో పేరు గాంచిన గోకుల్ చాట్ యజమాని విజయా వార్గికి కరోనా సోకింది. ఇటీవల జరిపిన పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌గా తేలింది. దీంతో అధికారులు షాప్‌ని క్లోజ్ చేయించారు. గోకుల్ చాట్ చుట్టూ కంటైన్మెంట్ వాతావరణం నెలకొంది. షాపులో పనిచేస్తున్న సుమారు 20 మందిని హోం క్వారంటైన్‌లో ఉంచారు. చుట్టుపక్కల ఉన్న యజమానులు తమ షాపులను మూసివేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం జీహెచ్ఎంసీ అధికారులు శానిటైజ్ చేయబోతున్నారు. మరోవైపు గత రెండు మూడు రోజులుగా గోకుల్ చాట్‌కి వచ్చిన వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. అయితే హైదరాబాద్‌లో ఇప్పటికే కరోనా విజృంభణ ఎక్కువగా ఉంది. ఇలాంటి నేపథ్యంలో జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఒకటైన గోకుల్ చాట్ యజమానికి కరోనా రావడం స్థానికంగా కలకలం రేపింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
Read This Story Also: ఎదురుచూస్తాం.. కనీసం ఆ పనైనా చేయండి.. సుశాంత్ ఫ్యాన్స్ డిమాండ్