curfew in vijayawada: కృష్ణా జిల్లాలో కర్ఫ్యూ నిబంధనలు పాటించని వారికి కఠిన పనిష్మెంట్.. మోకాళ్ల దండ వేయించి
కృష్ణా జిల్లాలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. అధికార యంత్రాంగం తగు చర్యలు తీసుకుంటున్నా చాలామంది ప్రజలు తమకేం పట్టనట్లుగా....
కృష్ణా జిల్లాలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. అధికార యంత్రాంగం తగు చర్యలు తీసుకుంటున్నా చాలామంది ప్రజలు తమకేం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఒకరి నిర్లక్ష్యం కారణంగా ఎంతోమంది ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లావ్యాప్తంగా ఆంక్షలు కఠినతరం చేశారు. కరోనా నిబంధనలు పాటించకుండా ఇష్టారీతిన తిరుగుతున్న వారికి పోలీసులు తమదైన శైలిలో వార్నింగ్ ఇస్తున్నారు. కృష్ణాజిల్లా మచిలీపట్టణంలో కర్ఫ్యూ నిబంధనలను పాటించని వారికి పోలీసులు మోకాళ్ల దండన విధించారు. అనవసరంగా రోడ్డుపైకి వస్తే ఈ సారి బండ్లు సీజ్ చేస్తామని డీఎస్పీ రమేష్ రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వం కరోనా వైరస్ ను కట్టడి చేసే క్రమంలో విధించిన కర్ఫ్యూ నిబంధనలను ప్రతిఒక్కరూ కచ్చితంగా పాటించాలని డీఎస్‌పీ రమేష్ రెడ్డి తెలిపారు.
కృష్ణాజిల్లా మచిలీపట్నం మూడు స్తంభాల సెంటర్ వద్ద 12 గంటలు దాటి, కర్ఫ్యూ నిబంధనలను పాటించకుండా రోడ్లపైకి వచ్చిన వారికి మోకాళ్ల దండన విధించారు. అత్యవసరం అయితే తప్పా ఇకపై కర్ఫ్యూ సమయంలో ఇంటి నుండి బయటకు వస్తే మీ వాహనాలను పోలీసు వారు స్వాధీనం చేసుకుంటారని హెచ్చరించారు. ఎవరైనా కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించి, ఆకతాయితనంగా రోడ్లపైకి వస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని అన్నారు.
అయితే సామాజిక దూరం పాటించాలని అధికారులతోపాటు ఇటు వైద్యులు తరచుగా చెబుతున్నా దాన్ని ప్రజలు అంతగా పట్టించుకోవడం లేదు. జిల్లాలోని రైతుబజార్లు, నిత్యావసర దుకాణాల వద్ద గుమిగూడి కనిపిస్తున్నారు. మాస్కులు వేసుకోకుండా, భౌతికదూరం పాటించకుండా వెళితే మరింత నష్టం కలిగే ప్రమాదం ఉంది. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఐదుగురికి మించి ఒకే చోట కనిపించకూడదు. దీనిపై పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
Also Read: కోవిడ్ కేర్ సెంటర్‌గా.. కల్వరి టెంపుల్.. 300 పడకలతో ఏర్పాటు