AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Pandamic: ఆదర్శ దంపతులంటే వీరే.. ఊరి జనంకోసం ఇంట్లోనే క్వారంటైన్‌ సెంటర్ ఏర్పాటు.. బాధితులందిరికీ ఉచితంగా..

Corona Pandamic: కరోనా వైరస్ కారణంగా ఎంతో మంది జీవితాలు చిన్నాభిన్నం అయ్యాయి. కరోనా సోకి.. సరైన ఆహారం, వసతి లభించక..

Corona Pandamic: ఆదర్శ దంపతులంటే వీరే.. ఊరి జనంకోసం ఇంట్లోనే క్వారంటైన్‌ సెంటర్ ఏర్పాటు.. బాధితులందిరికీ ఉచితంగా..
Quarantine Centre
Shiva Prajapati
|

Updated on: May 09, 2021 | 4:13 PM

Share

Corona Pandamic: కరోనా వైరస్ కారణంగా ఎంతో మంది జీవితాలు చిన్నాభిన్నం అయ్యాయి. కరోనా సోకి.. సరైన ఆహారం, వసతి లభించక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే, కరోనా బారిన పడిన వారికి ఓ ఆదర్శ జంట అండగా నిలుస్తోంది. వారికి బాసటగా నిలుస్తోంది. సొంత ఇంటినే క్వారంటైన్ గా చేసి, వారు మాత్రం అద్దె ఇంట్లో ఉంటున్నారు ఈ సేవా మూర్తులు. ఈ భార్య భర్తలు.. తమ ఇంట్లో క్వారంటైన్‌లో ఉన్న వారికి ఉచితంగా ఆహారం, మందులు అందజేసి వారి బాగోగులు చూసుకుంటున్నారు. అంతే కాదు కరోనాతో చనిపోయిన వారికి దహన కార్యక్రమాలు కూడా చేస్తున్న ఆదర్శ మూర్తులు వీరు. రెండు సార్లు ఆ దంపతులకు కరోనా సోకింది. అయినా ధైర్యంగా నిలబడ్డారు.. ఇంటినే క్వారెంటైన్ చేసుకుని కోలుకున్నారు.

వివరాల్లోకెళితే.. తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలం జగన్నాధపురానికి చెందిన శ్రీనివాస్ తెలుగు దేశం పార్టీ నాయకులు, భార్య మాజీ జడ్పీటీసీ. గ్రామంలో కరోనా సోకి ఇబ్బందులు పడుతున్న వారి పరిస్థితిని చూసి వారి చలించిపోయారు. ఈ క్రమంలో సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. తాము స్వంతంగా నిర్మించుకున్న పక్కాఇల్లును ఈ కరోనా కాలంలో కరోనా రోగులు ఉచితంగా హోమ్ క్వారంటైన్ ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు. వారు అమలాపురం లో ఒక అద్దె ఇల్లు తీసుకుని ఉంటున్నారు.

గతేడాది గ్రామంలోని కరోనా రోగులకు ఈ దంపతులు ఉచితంగా మందులు ఆహారం అందించారు. కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను ముట్టుకునేందుకు కుటుంబ సభ్యులు వెనకడుగు వేస్తున్న సమయంలో శ్రీనివాస్ ముందుకు వచ్చి దహన సంస్కారాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అప్పటిలోనే తన సొంత వాహనాన్ని అంబులెన్స్ గా మార్చి రోగులను ఆసుపత్రులకు చేర్చే వారు. ఏకంగా ఇప్పుడు తన ఇంటినే క్వారంటైన్‌ చేసి ఇంట్లో వున్న కరోనా రోగులకు ఆహారంతో పాటు మందులు, వైద్య సాయం అందిస్తున్నారు. తన ఇంటినే కాకుండా చుట్టుపక్కల కాళీగా ఉన్న ఇళ్లను కూడా అద్దెకు తీసుకుని మరీ కరోనా రోగులను అక్కడ ఉంచి చూసుకుంటున్నారు. సుమారు 75 మందిని తన ఇంట్లో పెట్టి వాళ్లకు భోజన సదుపాయం తోపాటు మందులు అన్ని సమకూర్చి యోగ క్షేమలు చూసుకుంటున్న ఈ దంపతులు ఆదర్శ మూర్తులుగా నిలుస్తున్నారు.

Also read:

Rural Grants: కరోనా విలయం.. కేంద్రం కీలక నిర్ణయం.. స్థానిక సంస్థలకు రూ. 8,923 కోట్లు విడుద‌ల‌

Ausis Cricket Team: బార్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ఫైట్‌?.. సోషల్ మీడియాలో వార్త రచ్చ.. వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఆ ఇద్దరు..!