ఉత్తరాఖండ్‌లో 67 కరోనా పాజిటివ్ కేసులు..ఒకరు మృతి
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఉత్తరాఖండ్‌లో మంగళవారం 67 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వైరస్ బారినపడి ఓ మహిళ మరణించినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. హల్ద్వానీ కేంద్రంగా
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఉత్తరాఖండ్‌లో మంగళవారం 67 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వైరస్ బారినపడి ఓ మహిళ మరణించినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. హల్ద్వానీ కేంద్రంగా పని చేస్తున్న సుశీలతివారీ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళ మంగళవారం మృతిచెందినట్లుగా తెలిపారు. మరణించిన మహిళ తొలుత హల్ద్వానీలోని బేస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా..అక్కడ్నుంచి ఆమెను సుశీలతివారీ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. మృతురాలు మే26న ఢిల్లీ నుంచి అల్మోరాకు బస్సులో వచ్చినట్లు అధికారులు గుర్తించారు.
రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నమోదైన 67కేసుల్లో మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా నుంచి వచ్చిన వారున్నారని పేర్కొంది. అల్మోరా జిల్లాలో 10, డెహ్రాడూన్ 12, హరిద్వార్ 8, నైనిటాల్ 2, పౌరీ గర్వాల్ 2, తెహ్రీ గర్వాల్ 14, పితోరాగఢ్ 7, ఉధంసింగ్‌నగర్ 8, ఉత్తరకాశీలో 4 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఐదుగురు కరోనా నుంచి కొలుకొని పలు ఆస్పత్రుల డిశ్చార్జి అయినట్లు అధికారులు వివరించింది.