కేరళలో పెరుగుతున్న కరోనా కేసులు.. తాజాగా మరో 79 కేసులు..
కేరళ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా నిత్యం పదుల సంఖ్యలో కేసులు నమోదవతున్నాయి.
కేరళ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా నిత్యం పదుల సంఖ్యలో కేసులు నమోదవతున్నాయి. నెల క్రితం కరోనా ముక్త్ రాష్ట్రంగా అవతరిస్తుందనుకున్న వేళ.. ఒక్కసారిగా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మంగళవారం నాడు కొత్తగా మరో 79 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని కేరళ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1,366 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. 1,234 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. కరోనా వైరస్‌ను కట్టడిలో భాగంగా 125కు పైగా హాట్‌స్పాట్‌లను గుర్తించి.. అక్కడ వైరస్ విజృంభించకుండా కట్టడి చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రానికి కొత్తగా ఎవరైనా వస్తే.. వారు పాస్ తీసుకుని ఏడు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని ప్రభుత్వం నియమం పెట్టింది.