ప్రైవేటు స్కూళ్ల దోపిడి.. హైకోర్టును ఆశ్రయించిన పేరెంట్స్..

ప్రైవేటు స్కూల్స్ ఫీజులు, ఆన్ లైన్ క్లాసులపై హైకోర్టును ఆశ్రయించారు పేరెంట్స్. జీవో 46ని ఉల్లంఘించి ఫీజులు వసూలుపై తల్లితండ్రులు కోర్టును ఆశ్రయించారు. ఆన్ లైన్ క్లాసెస్ వల్ల ఇబ్బంది ఏర్పడుతోందని న్యాయస్థానానికి ఫిర్యాదు చేస్తూ..

ప్రైవేటు స్కూళ్ల దోపిడి.. హైకోర్టును ఆశ్రయించిన పేరెంట్స్..
TV9 Telugu Digital Desk

| Edited By:

Jun 30, 2020 | 7:38 PM

ప్రైవేటు స్కూల్స్ ఫీజులు, ఆన్ లైన్ క్లాసులపై హైకోర్టును ఆశ్రయించారు పేరెంట్స్. జీవో 46ని ఉల్లంఘించి ఫీజులు వసూలుపై తల్లితండ్రులు కోర్టును ఆశ్రయించారు. ఆన్ లైన్ క్లాసెస్ వల్ల ఇబ్బంది ఏర్పడుతోందని న్యాయస్థానానికి ఫిర్యాదు చేస్తూ, హైకోర్డులో పిల్ దాఖలు చేసింది హైదరాబాద్ పేరెంట్ అసోసియేషన్. అడ్డగోలు ఫీజులు వసూళ్ల కోసం స్కూల్స్ పంపించిన సందేశాలను వాయిస్‌లను సాక్ష్యాలుగా చూపించింది హెచ్ఎస్‌పిఏ. హైదరాబాద్ పేరెంట్ అసోసియేషన్ పిల్‌ను స్వీకరించింది తెలంగాణ హైకోర్టు. దీనిపై త్వరలోనే చర్చ చేపట్టనుంది హైకోర్టు.

కరోనా సంక్షోభంలో స్కూల్‌ ఫీజుల వసూళ్లపై ప్రభుత్వం కొన్ని ఆదేశాలను జారీ చేసింది. ట్యూషన్‌ ఫీజులు మాత్రమే వసూలు చేయాలని, అది కూడా నెలవారిగా ఫీజులను తీసుకోవాలంటూ ఇదివరకే జీవో నెంబర్‌ 46ను విడుదల చేసింది. అంతేకాదు, స్కూళ్లు ఫీజుల పేరుతో వేధిస్తే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని కూడా సూచించింది. కానీ! సర్కారు ఆదేశాలను ప్రైవేటు స్కూళ్లు తుంగలో తొక్కాయి. ఆన్‌లైన్‌ క్లాసుల పేరుతో తల్లిదండ్రులను బెదిరిస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడ్డాయి. నెలవారి ఫీజుల వసూలు నిబంధనను పక్కనబెట్టి, ఒకేసారి పెద్ద మొత్తంలో ఫీజులు కట్టించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పేరెంట్ అసోసియేషన్ హైకోర్టును ఆశ్రయించింది.

Read More: 

కరోనా వ్యాక్సిన్ వస్తే ముందు వాళ్లకే.. ప్రధాని కీలక సూచనలు

కేంద్రం స్టన్నింగ్ డెసిషన్.. మరి ఇన్‌స్టాల్‌ చేసిన యాప్స్ పనిచేస్తాయా?

బ్రేకింగ్: లాక్‌ డౌన్‌పై మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu