Breaking News
  • భారత్ లో కరోనా కల్లోలం. 9 లక్షల 6 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 906752 దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 311565 కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 571460 దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 23727 కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • రాజస్థాన్‌లో అసమ్మతి వర్గంపై అనర్హత అస్త్రం. స్పీకర్ కి ఫిర్యాదు చేసిన సీఎం అశోక్ గెహ్లాట్ వర్గం. అనర్హత వేటుకు ప్రక్రియ ప్రారంభం. అసమ్మతి వర్గానికి నోటీసులిచ్చిన స్పీకర్. ఈనెల 17లోగా వివరణ ఇవ్వాలని ఆదేశం.
  • ఆన్ లైన్ క్లాసులపై మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం కరోనా కారణంగా తెరుచుకోని విద్యాసంస్థలు ఆన్ లైన్ క్లాసులతో విద్యార్థులపై ఒత్తిడి నర్సరీ చిన్నారులకు 30 నిమిషాల క్లాస్ మాత్రమే ఉండాలన్న కేంద్రం కరోనా మహమ్మారి కారణంగా విద్యా వ్యవస్థ మొత్తం అస్తవ్యస్థమైంది. ఇప్పట్లో విద్యాసంస్థలు తెరుచుకునే అవకాశాలు దాదాపు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు ఆన్ లైన్ లో పాఠాలను బోధించే కార్యక్రమాన్ని మొదలుపెట్టాయి. మరోవైపు, గంటల తరబడి మొబైల్ ఫోన్లలో క్లాసులు వింటున్న విద్యార్థులు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆన్ లైన్ క్లాసుల నిర్వహణపై స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది.
  • అమరావతి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో కరోనా వ్యాప్తినిరోధక చర్యలు . పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ప్రధాన కార్యాలయానికి ఎవ్వరూ రావద్దని సర్కులర్ జారీ . విభాగాధిపతి హోదాలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని పీఆర్ఆర్డీ కార్యాలయాల అధికారులు, ఉద్యోగులు సిబ్బందికి ఆదేశాలు . ఆదేశాలు జారీ చేసింది ఆ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ .
  • రెండు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు . రుతుపవనాల కు తోడైన రెండు ఉపరితల ఆవర్తనాలు. వాయువ్య బంగాళాఖాతం , గాంగేటిక్ పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం -హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ సైంటిస్ట్ రాజారావు.
  • శ్రీశైలం లో కరోనా కలకలం. ఆలయ ఉద్యోగులకు కూడా కరోనా సోకడంతో ఈరోజు నుంచి వారం రోజుల పాటు భక్తులందరికీ శ్రీశైలం ఆలయ దర్శనం నిలిపివేత. ఇప్పటికే ఎండోమెంట్ కమిషనర్, కర్నూలు కలెక్టర్ తో అనుమతి తీసుకున్న ఈఓ రామారావు.
  • బంజారాహిల్స్ లో 50 కోట్లు విలువైన లాండ్ కేసులో కొత్త కోణం . ఎకరా 20 గుంటలకు చెందినా ల్యాండ్ పత్రాలన్ని నకిలీవి గా తేల్చిన ఏసీబీ.  కోర్ట్ కి అందజేసిన పత్రాలు అన్ని ఫోర్జరీ , నకిలీ గా విచారణ లో వెల్లడి .

కరోనా వ్యాక్సిన్ వస్తే ముందు వాళ్లకే.. ప్రధాని కీలక సూచనలు

ప్రధాని నరేంద్ర మోదీ కాసేపటి క్రితమే జాతినుద్ధేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగంలో అన్‌లాక్ 2.0, మాస్క్ వినియోగం గురించి ప్రస్తావించారు. అలాగే దేశ వ్యాప్తంగా ఉన్న పేద ప్రజలందరికీ నవంబర్‌ వరకూ ఫ్రీ రేషన్ ఇస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం వ్యాక్సిన్ పంపిణీ సన్నద్ధతపై ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్షా..
PM Chairs meeting to review planning and preparations for vaccination against Corona, కరోనా వ్యాక్సిన్ వస్తే ముందు వాళ్లకే.. ప్రధాని కీలక సూచనలు

ప్రధాని నరేంద్ర మోదీ కాసేపటి క్రితమే జాతినుద్ధేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగంలో అన్‌లాక్ 2.0, మాస్క్ వినియోగం గురించి ప్రస్తావించారు. అలాగే దేశ వ్యాప్తంగా ఉన్న పేద ప్రజలందరికీ నవంబర్‌ వరకూ ఫ్రీ రేషన్ ఇస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం వ్యాక్సిన్ పంపిణీ సన్నద్ధతపై ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. కోవిడ్‌‌కు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ముందుగా మహామ్మారితో పోరాడుతున్న వైద్య సిబ్బందితో పాటు వైరస్ ముప్పున ప్రజలకు టీకా ఇవ్వాలని అన్నారు ప్రధాని మోదీ.

అలాగే వాక్సిన్ తయారైతే వాటిని దేశమంతటా ఎలా పంపిణీ చేయాలి?  ముందుగా ఎవరికి వ్యాక్సిన్ ముందు ఇవ్వాలి? అని వివిధ డిపార్ట్‌మెంట్ల‌ మధ్య సమన్వయం ఎలా ఉండాలన్నదానిపై అధికారులు మార్గదర్శకాలు సూచించారు ప్రధాని మోదీ.

1. కరోనా ముప్పు అధికంగా ఉండే వైద్య సిబ్బందికి, పారిశుద్ధ్య సిబ్బందికి, వృద్ధులకు, చిన్న పిల్లలకు ముందుగా టీకాలు ఇవ్వాలి.
2. దేశంలోని ప్రతీ పౌరునికీ, ప్రాంతానికి వ్యాక్సిన్ సరఫరా అయ్యేలా కార్యాచరణ రూపొందించాలి.
3. కరోనా టీకాలు సరసమైన ధరలకే అందుబాటులో ఉండాలి. అధిక ధరల కారణంగా ఎవరూ వ్యాక్సిన్‌కు దూరం కాకూడదు.
4. కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి నుంచి పంపిణీ వరకూ అన్నింటినీ స్పెషల్ టెక్నాలజీ సహాయంతో పర్యావేక్షించాలి.

కాగా ఇక ప్రపంచ వ్యాప్తంగా పలువురు శాస్త్రవేత్తలు, ఫార్మా కంపెనీలు కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం నిరంతం శ్రమిస్తున్న విషయం తెసిందే. ఇప్పటికే చాలా సంస్థల వ్యాక్సిన్లు చివరి దశలో ఉన్నాయి.

Read More: 

కేంద్రం స్టన్నింగ్ డెసిషన్.. మరి ఇన్‌స్టాల్‌ చేసిన యాప్స్ పనిచేస్తాయా?

బ్రేకింగ్: లాక్‌ డౌన్‌పై మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు..

Related Tags