మొదటి కస్టమర్‌కు గోల్డెన్ ఆఫర్…’బంగారు కత్తెర’తో హెయిర్‌కట్!
కరోనా మహమ్మారితో మహారాష్ట్ర చిగురుటాకుల వణికిపోతోంది. రోజుకు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మరోవైపు లాక్‌డౌన్ కారణంగా ప్రజలు, దినసరి కూలీలు, కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. చిరు వ్యాపారులు, పాన్ షాపులు, బార్బర్ షాపుల వారి అవస్థలు వర్ణనాతీతంగా మారాయి.

కరోనా మహమ్మారితో మహారాష్ట్ర చిగురుటాకుల వణికిపోతోంది. రోజుకు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మరోవైపు లాక్‌డౌన్ కారణంగా ప్రజలు, దినసరి కూలీలు, కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. చిరు వ్యాపారులు, పాన్ షాపులు, బార్బర్ షాపుల వారి అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. ఇప్పటికే ఆయా రంగాల వారు షాపులు తెరిచేందుకు అనుమతి కోరుతూ…రాష్ట్ర సర్కార్ విన్నవించారు. ఈ క్రమంలోనే ‘మిషన్ బిగిన్ ఎగైన్’ పేరుతో జూన్ 28 నుంచి సెలూన్లు, బ్యూటీ పార్లర్‌లను తిరిగి తెరవడానికి ప్రభుత్వం అనుమతించింది. దీంతో చాలా చోట్ల బార్బర్ షాపులు తిరిగి తెరుచుకున్నాయి.
కరోనా, లాక్‌డౌన్ కారణంగా మూడు నెలలపాటు మూతబడిన కట్టింగ్ షాపులు(బార్బర్ షాపులు) తిరిగి తెరుచున్నాయి. ఇన్నిరోజులు కస్టమర్లు లేక ఉపాధిని కోల్పోయిన వారంతా ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయినా.. కస్టమర్లు వస్తారని భరోసా ఇవ్వలేదనే అసహనం కూడా వారిని వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో ఓ బార్బర్ షాపు యాజమాని వినూత్న ఆలోచన చేశాడు. లాక్‌డౌన్ తర్వాత మొదటిసారిగా వచ్చిన కస్టమర్‌ను అతిథి కన్నా ఎక్కువగా గౌరవించి బంగారు కత్తెరతో హెయిర్ కట్ చేసి తన వృత్తి పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకున్నాడు. ఈ కొల్లాపూర్ లో వెలుగు చూసింది.
కొల్లాపూర్‌కు చెందిన రంభౌ సంక్‌పాల్ ఎంతో ఉత్సాహంతో కస్టమర్‌ను ట్రీట్ చేశాడు. దీంతో కస్టమర్ కూడా చాలా సంతోషించాడు. ‘సెలూన్లకు అనుమతి ఇవ్వడంతో మా అందరి ముఖాల్లో ఆనందానికి హద్దు లేదు. మాకు ఇవి తప్ప మరే పని తెలియదని చెప్పుకొచ్చాడు.. అందుకే చాలారోజుల తర్వాత వచ్చిన కస్టమర్‌ను ఇలా స్వాగతించామని చెప్పాడు. ప్రభుత్వం నిర్దేశించిన కోవిడ్ నిబంధనల మేరకు షాపుల్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పాడు.




