Corona: ఆ మెడిసిన్ వేసుకుంటే అంతేనా.. మరో షాకింగ్ న్యూస్!
కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ మహమ్మారి కారణంగా ఇప్పటికే లక్షల్లో మరణాలు సంభవించాయి. దీని వ్యాప్తిని కట్టడి చేసేందుకు మందు కనిపెట్టే ప్రయత్నాల్లో శాస్త్రవేత్తలు రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు. ఇదిలా ఉంటే భారత్, అమెరికాతో పాటు పలు దేశాల్లో కరోనా పేషంట్లను నయం చేసేందుకు యాంటీ మలేరియా డ్రగ్ హైడ్రోక్లోరోక్విన్‌ను ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా ఓ స్టడీలో హైడ్రోక్లోరోక్విన్ గురించి పలు సంచలన నిజాలు బయటపడ్డాయి. ది లాన్సెట్‌లో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం […]

కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ మహమ్మారి కారణంగా ఇప్పటికే లక్షల్లో మరణాలు సంభవించాయి. దీని వ్యాప్తిని కట్టడి చేసేందుకు మందు కనిపెట్టే ప్రయత్నాల్లో శాస్త్రవేత్తలు రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు. ఇదిలా ఉంటే భారత్, అమెరికాతో పాటు పలు దేశాల్లో కరోనా పేషంట్లను నయం చేసేందుకు యాంటీ మలేరియా డ్రగ్ హైడ్రోక్లోరోక్విన్‌ను ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా ఓ స్టడీలో హైడ్రోక్లోరోక్విన్ గురించి పలు సంచలన నిజాలు బయటపడ్డాయి. ది లాన్సెట్‌లో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం ఈ యాంటీ మలేరియా డ్రగ్‌తో చికిత్స పొందిన కరోనా రోగులకు హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటాయని.. కొన్నిసార్లు మరణాలు కూడా సంభవించవచ్చునని తేలింది.
హార్వర్డ్ మెడికల్ స్కూల్ కు చెందిన పరిశోధకులు దాదాపు ఆరు ఖండాల్లోని 671 ఆసుపత్రులలో సుమారు 96,000 మందికి పైగా ఉన్న కరోనా రోగులపై అధ్యయనం చేసిన తర్వాత ఈ సంచలన విషయాన్ని బయటపెట్టారు. హైడ్రాక్సీక్లోరోక్విన్ లేదా క్లోరోక్విన్ డ్రగ్ తీసుకున్న రోగులకు గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఆ అధ్యయనంలో పేర్కొన్నారు. గతేడాది డిసెంబర్ 20 నుంచి ఏప్రిల్ 14 మధ్య సుమారు 14,888 మంది కరోనా రోగులు మాక్రోలైడ్‌తో పాటు హైడ్రాక్సీక్లోరోక్విన్ మందుతో చికిత్స పొందారని.. వారిలో దాదాపు 10,700 మంది రోగులు మరణించారని తెలిపారు. వాళ్ల వయసు, లింగ భేదాలు, ఆరోగ్య పరిస్థితులతో సహా పలు అంశాలను పరిశీలించిన తర్వాత హైడ్రాక్సీక్లోరోక్విన్ తీసుకున్న రోగులలో మరణాల రేట్ 34 శాతానికి పెరిగిందని.. అంతేకాక తీవ్రమైన హార్ట్ అరిథ్మియా వచ్చే ఛాన్సులు 137 శాతం ఉన్నాయని స్పష్టం చేశారు. కాగా, కరోనా వైరస్ రాకుండా ఉండేందుకు తాను హైడ్రాక్సీక్లోరోక్విన్ టాబ్లెట్ తీసుకుంటున్నట్లు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పిన కొన్ని రోజుల తర్వాత ఈ నివేదిక ప్రచురించబడటం గమనార్హం.
Read More:
కిమ్ గురించి మరో షాకింగ్ నిజం.. నార్త్ కొరియాలో కలకలం..
మరో కొత్త వైరస్ కలకలం.. వందల సంఖ్యలో గుర్రాలు మృతి..
వాహనదారులకు ఊరట.. ఏపీలో సీజ్ చేసిన వాహనాల విడుదలకు గ్రీన్ సిగ్నల్..
