ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్: వైద్యశాఖలో ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్

రాష్ట్రంలోని వైద్య శాఖ ఖాళీలను భర్తీ చేయాలంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌వెూహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్: వైద్యశాఖలో ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్
Follow us

|

Updated on: May 23, 2020 | 6:32 PM

కరోనా సోకడం పాపం, నేరం కాదన్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. కరోనాపై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ వైరస్ ఎవరికైనా వ్యాపిస్తుందని.. కరోనా పట్ల ప్రజల్లో ఉన్న ఆందోళనలను తొలగించాలన్నారు. ఇక కరోనా పరీక్షలకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలన్న సీఎం..జగన్ వైద్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలోనే భర్తీ చేయాలిన అధికారులను ఆదేశించారు. మరోవైపు తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాలో పీహెచ్ సీ స్థాయి వరకూ కరోనా టెస్టులు చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ సీఎస్‌ జవహర్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. త్వరలో 9700కి పైగా డాక్టర్లు, వైద్యసిబ్బంది పోస్టులను భర్తీ చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ సీఎస్‌ జవహర్‌ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని వైద్య శాఖ ఖాళీలను భర్తీ చేయాలంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌వెూహన్‌రెడ్డి ఆదేశించారని అందుకు అనుగుణంగా కార్యాచరణ చేస్తున్నామని చెప్పారు. కరోనా వైరస్‌ నియంత్రణ కోసం మరిన్ని ప్రత్యేక చర్యలు చేపట్టామని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి ప్రయాణికులు వస్తున్నందున అదనపు బెడ్లు సిద్ధం చేస్తున్నామన్నారు. హై రిస్క్‌ ఉన్న మహారాష్ట్ర, గుజరాత్‌ ప్రయాణికులందరికీ పరీక్షలు చేస్తామన్నారు.