ప్రయాణికులకు మరో శుభవార్త…రైల్వే కౌంటర్లలోనూ టికెట్ల విక్రయం

శుక్రవారం ఉదయం నుంచి కామన్ సర్వీస్ సెంటర్లలోనూ టికెట్లు బుక్ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నామని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. రెండు, మూడు రోజుల్లో రైల్వే కౌంటర్లలోనూ టికెట్ల విక్రయం..రైల్వే స్టేషన్లలో దుకాణాలు..

ప్రయాణికులకు మరో శుభవార్త...రైల్వే కౌంటర్లలోనూ టికెట్ల విక్రయం
Follow us

|

Updated on: May 21, 2020 | 5:13 PM

జూన్ 1 నుంచి ప్రారంభంకానున్న రైలు ప్రయాణానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. రిజర్వేషన్లు ప్రారంభించిన 2 గంటల్లోనే 1.50 లక్షల టికెట్లు బుక్ అయినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు కేవలం 73 రైళ్లకు మాత్రమే టికెట్లు మిగిలాయన్నారు. 2,90,510 మంది ప్రయాణికులకు గానూ 1,49,025 టికెట్లు జారీ చేసినట్లు చెప్పారు. మిగిలిన టికెట్లు కూడా పూర్తైన తర్వాత 200వరకు వెయిటింగ్ లిస్ట్ టికెట్లకు అవకాశం కల్పిస్తామన్నారు. ఇదిలా ఉంటే తాజాగా రైళ్ల పునరుద్ధరణపై కేంద్ర ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ ప్రకటించింది.

శుక్రవారం ఉదయం నుంచి కామన్ సర్వీస్ సెంటర్లలోనూ టికెట్లు బుక్ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నామని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. రెండు, మూడు రోజుల్లో రైల్వే కౌంటర్లలోనూ టికెట్ల విక్రయం ప్రారంభిస్తామని, క్రమంగా రైళ్ల సంఖ్యను పెంచే యోచనలో ఉన్నట్లు మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. శుక్రవారం నుంచి దేశవ్యాప్తంగా 1.7 లక్షల కామన్ రైల్వే సెంటర్లలో టికెట్ల విక్రయం ప్రారంభించనున్నట్లు తెలిపారు. అయితే.. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఎంపిక చేసిన రైల్వే కౌంటర్లలోనే ఈ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి సంకేతం ఇచ్చారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. రైల్వే స్టేషన్లలో దుకాణాలు తెరుచుకోవడానికి కూడా అనుమతి ఇచ్చినట్లు మంత్రి వెల్లడించారు. అయితే.. టేక్ అవేకు సంబంధించిన దుకాణాలకే పర్మిషన్ ఇచ్చినట్లు వివరించారు.