టిక్‌టాక్‌కు భారీ షాక్.. రేటింగ్స్ ఢమాల్..

టిక్‌టాక్‌.. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర ఈ యాప్ తప్పనిసరిగా ఉంటుంది. ఈ అప్లికేషన్‌ను ఎక్కువగా భారత్‌లోనే ఉపయోగిస్తారు. ఇలా తక్కువకాలంలోనే అత్యధిక పాపులారిటీ సాధించిన ఈ టిక్‌టాక్‌కు గత కొద్దిరోజులుగా షాక్ తగులుతూ వస్తోంది. యాప్ రేటింగ్ పూర్తిగా దిగజారిపోయింది. అందుకు రెండు కారణాలు.. ఒకటి కరోనా వైరస్ అయితే.. మరొకటి అనుచిత, ప్రేరేపిత, హింసాత్మక వీడియోలు కారణంగా భారత యూజర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇక టిక్ టాక్ […]

  • Ravi Kiran
  • Publish Date - 4:54 pm, Thu, 21 May 20
టిక్‌టాక్‌కు భారీ షాక్.. రేటింగ్స్ ఢమాల్..

టిక్‌టాక్‌.. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర ఈ యాప్ తప్పనిసరిగా ఉంటుంది. ఈ అప్లికేషన్‌ను ఎక్కువగా భారత్‌లోనే ఉపయోగిస్తారు. ఇలా తక్కువకాలంలోనే అత్యధిక పాపులారిటీ సాధించిన ఈ టిక్‌టాక్‌కు గత కొద్దిరోజులుగా షాక్ తగులుతూ వస్తోంది. యాప్ రేటింగ్ పూర్తిగా దిగజారిపోయింది. అందుకు రెండు కారణాలు.. ఒకటి కరోనా వైరస్ అయితే.. మరొకటి అనుచిత, ప్రేరేపిత, హింసాత్మక వీడియోలు కారణంగా భారత యూజర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇక టిక్ టాక్ యాప్ చైనా ప్రోడక్ట్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. సో ఈ రెండింటి కారణంగా కొన్ని రోజులుగా టిక్ టాక్‌ను బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద యుద్ధం జరుగుతోంది.

అందుకే ఒక్కసారిగా ఈ యాప్ రేటింగ్ పడిపోయింది. ఒకప్పుడు 4.5 స్టార్ రేటింగ్ ఉండగా.. ప్రస్తుతం అది కాస్తా 1.2కి దిగజారింది. దేశంలోని లక్షలాది మంది యూజర్లు ఇప్పటికే టిక్ టాక్‌కు వ్యతిరేకంగా గూగుల్ ప్లే స్టోర్‌లో నెగటివ్ కామెంట్స్ పెడుతుండటంతో పాటు 1 స్టార్ రేటింగ్ ఇస్తున్నారు. కాగా, యూజర్లు ఈ విధంగా చేస్తున్నా.. టిక్ టాక్ బ్యాన్ అయ్యే పరిస్థితి లేదని డెవలపర్లు అంటున్నారు. ప్రస్తుతం 1.3 రేటింగ్ ఉండగా.. ఇదే పరిస్థితి కొద్దిరోజులు కంటిన్యూ అయితే అది 1 స్టార్ రేటింగ్‌కు పడుతుందని వారు తెలిపారు.

Read This: లాక్‌డౌన్‌తో జాబ్‌ పోయింది.. లక్కీగా రూ.46 కోట్ల లాటరీ తగిలింది..