దేశంలో ఫుడ్ డెలివరీకి అమెజాన్ రెడీ

కరోనా మహమ్మారి నేపథ్యంలో స్విగ్గీ, జొమాటో లు తమ సంస్థల్లో పని చేస్తున్న వందలాదిమందికి లే ఆఫ్ లు ప్రకటించాయి. అయితే మందు బాబులకు తీపి కబురును అందిస్తూ ఆల్కహాల్ ని హోమ్ డెలివరీ చేసేందుకు నిర్ణయించాయి.

దేశంలో ఫుడ్ డెలివరీకి అమెజాన్ రెడీ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 21, 2020 | 5:47 PM

కరోనా మహమ్మారి నేపథ్యంలో స్విగ్గీ, జొమాటో లు తమ సంస్థల్లో పని చేస్తున్న వందలాదిమందికి లే ఆఫ్ లు ప్రకటించాయి. అయితే మందు బాబులకు తీపి కబురును అందిస్తూ ఆల్కహాల్ ని హోమ్ డెలివరీ చేసేందుకు నిర్ణయించాయి. రెండు నెలల లాక్ డౌన్ కారణంగా దేశంలో పెద్ద ఎత్తున  రెస్టారెంట్లు బిజినెస్ లేక మూతబడిన నేపథ్యంలో ఈ సంస్థలకు సైతం నష్టాలు  తప్పలేదు. అయితే లాక్ డౌన్ ఆంక్షలు చాలావరకు సడలడంతో ఇవి ముఖ్యంగా మద్యాన్ని డోర్ డెలివరీ చేసేందుకు నడుం కట్టాయి. ఇదే సమయంలో.. అమెజాన్ ఫుడ్ డెలివరీకి శ్రీకారం చుట్టింది. మొదట బెంగుళూరు నగరాన్ని తాము ఇందుకు ఎంపిక చేసుకున్నామని ఈ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. దేశవ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేయడంతో లక్షలాది మంది ఫుడ్ డెలివరీ పట్ల విముఖత చూపారు.  హైదరాబాద్ వంటి నగరాల్లో లాక్ డౌన్ కఠినంగా అమలవుతున్నప్పుడు ఇలాంటి సంస్థలనుంచి ఫుడ్ డెలివరీని ఆయా ప్రభుత్వాలు నిషేధించాయి. అయితే ఇప్పుడు పరిస్థితి మళ్ళీ సాధారణ స్థాయికి వస్తోంది.  ఆంక్షలు చాలావరకు సడలాయి. దీంతో అమెజాన్ వెంటనే రంగంలోకి దిగింది. ప్రముఖ రెస్టారెంట్ల నుంచి, అత్యున్నత ప్రమాణాలతో తాము ఫుడ్ డెలివరీ చేస్తామని, పైగా ఇందుకోసం ‘హైజీన్ సర్టిఫికేషన్ బార్’ ని ఏర్పాటు చేశామని ఈ సంస్థ ప్రతినిధి వివరించారు. బెంగుళూరుతో మొదలుపెట్టి. క్రమంగా అన్ని నగరాలకు ఈ సౌకర్యాన్ని విస్తరిస్తామన్నారు.

సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు